Hyderabad: సికింద్రాబాద్‌లో భారీగా స్టెరాయిడ్స్‌ స్వాధీనం.. నిందితుడి అరెస్టు

డ్రగ్ కంట్రోల్ అధికారులు సికింద్రాబాద్‌లో భారీగా స్టెరాయిడ్స్‌ పట్టుకున్నారు.

Updated : 11 Jul 2024 14:25 IST

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌: డ్రగ్ కంట్రోల్ అధికారులు సికింద్రాబాద్‌లో భారీగా స్టెరాయిడ్స్‌ పట్టుకున్నారు. వాటిని సరఫరా చేస్తున్న ఖాసిం అనే యువకుడిని అరెస్టు చేశారు. నిందితుడు జిమ్‌లలో స్టెరాయిడ్స్‌ను సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. దేహదారుఢ్యం కోసం వీటిని యువకులకు ఇస్తున్నారని అధికారులు తెలిపారు. స్టెరాయిడ్స్‌ స్వాధీనం చేసుకున్న డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు నిందితుడిని పోలీసులకు అప్పగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని