Published : 17 Jan 2022 08:11 IST

Crime News: సామాజిక మాధ్యమంలో భార్య అసభ్య దృశ్యాలు..పిల్లలకు విషమిచ్చి.. తానూ తాగిన భర్త

ఇద్దరి పరిస్థితి విషమం

సీతానగరం, న్యూస్‌టుడే: తన భార్య వేరే వ్యక్తితో కలిసి ఉన్న అసభ్యకర దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త విషం తాగి, పిల్లలతోనూ తాగించాడు. అతడితో పాటు పదేళ్ల కొడుకు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం ఎస్సై శుభశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వంగలపూడికి చెందిన 30 ఏళ్ల వివాహిత ఉపాధి నిమిత్తం కువైట్‌లో ఉంటుంది. ఆమె భర్త స్వగ్రామం గోకవరంలో, ఇద్దరు కుమారులు (13, 10) కుమార్తె (12) అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు. తండ్రి అప్పుడప్పుడు వెళ్లి పిల్లల్ని చూస్తుంటాడు. శనివారం సాయంత్రం పండగ పేరుతో వంగలపూడి వచ్చిన తండ్రి.. తన ముగ్గురు పిల్లలను బయటకు తీసుకెళ్లాడు. తోటల్లోకి తీసుకెళ్లి ముందుగా తాను ఎలుకల మందు తాగేశాడు. తర్వాత ముగ్గురు పిల్లలతో తాగించే ప్రయత్నం చేశాడు. అందులో పదేళ్ల చిన్న కుమారుడు మందు తాగేశాడు. మిగతా ఇద్దరు తాగలేదు. ఇంతలో అతడు అపస్మారక పరిస్థితికి చేరుకోవడంతో ఆ ఇద్దరు పిల్లలను వదిలేశాడు. కొద్ది సేపటికి వారిని గమనించిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శుభశేఖర్‌ ఘటనాస్థలానికి చేరి బాధితులను ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన చికిత్స కోసం ఆదివారం వారిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిగతా ఇద్దరు పిల్లలు సురక్షితంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. సమీప బంధువుల నుంచే సామాజిక మాధ్యమాల్లో వీడియో వచ్చిందని, దాంతో తాను మనస్తాపానికి గురై ఇలా చేశానని బాధితుడు పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంటులో చెప్పాడు. అయితే అతడు చెబుతున్న వీడియోలను ఇంకా పరిశీలించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. అతడు ఆటో నడుపుతాడని, గతంలో చోరీలకు పాల్పడినట్లు గోకవరంలో అతడిపై కేసులు ఉన్నాయని ఎస్సై తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

చేదుమందు తాగించబోయాడు
‘నాన్న ఎప్పుడూ మమ్మల్ని పట్టించుకోడు. అమ్మమ్మ ఇంటి వద్దే ఉండి చదువుకుంటున్నాం. అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తుంటాడు. అలాగే పండగకు వచ్చాడనుకుని బయటకు వెళ్దామంటే బయలుదేరాం..’ అని మిగతా ఇద్దరు పిల్లలు చెప్పారు. బలవంతంగా తమతో ఏదో చేదు మందు తాగించే ప్రయత్నం చేశాడని, తామిద్దరం నిరాకరించగా.. తమ్ముడు తెలియకుండానే తాగేశాడని వివరించారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని