Crime News: పంజాగుట్టలో దారుణం... భార్యను హతమార్చి, రైలుకింద పడి భర్త ఆత్మహత్య
నగరంలోని పంజాగుట్టలో దారుణం చోటుచేసుకుంది. దంపతుల మధ్య ఏర్పడిన వివాదం నిండు ప్రాణాలను బలితీసుకుంది. మనస్పర్థల కారణంగా క్షణికావేశంలో భార్యను
హైదరాబాద్: నగరంలోని పంజాగుట్టలో దారుణం చోటుచేసుకుంది. దంపతుల మధ్య ఏర్పడిన వివాదం నిండు ప్రాణాలను బలితీసుకుంది. మనస్పర్థల కారణంగా క్షణికావేశంలో భార్యను చంపేసిన భర్త.. ఆ తర్వాత తానుకూడా ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం... అస్సాం రాష్ట్రానికి చెందిన మహానంద బిశ్వాస్(24), పంప సర్కార్ (22) దంపతులు జీవనోపాధి కోసం నగరానికి వచ్చి పంజాగుట్ట పరిధిలోని ప్రేమ్‌నగర్‌లో నివాసముంటున్నారు. వీరిద్దరూ జీవీకే మాల్‌లో సెక్యూరిటీ గార్డ్స్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
ఈక్రమంలో దంపతుల మధ్య ఏర్పడిన వివాదం ఇద్దరినీ బలితీసుకుందని పోలీసులు భావిస్తున్నారు. సోమవారం సాయత్రం భార్యను నీళ్లతో ఉన్న బకెట్లో తలవరకు ముంచి హతమార్చాడు. ఆ తర్వాత నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. బిశ్వాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించే సమయంలో అతని వద్ద ఉన్న చిన్న డైరీలో తన భార్యను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడినట్టు రాసిన లేఖ లభ్యమైంది. వెంటనే నాంపల్లి రైల్వే పోలీసులు ఇచ్చిన సమాచారంతో పంజాగుట్ట పోలీసులు ప్రేమ్‌నగర్‌లోని అతని నివాసానికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో తాళం పగులగొట్టి పంప సర్కార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని పంజాగుట్ట డీఐ నాగయ్య తెలిపారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Air India: వేడి నీళ్లు పడి విమాన ప్రయాణికురాలికి గాయాలు.. క్షమాపణలు కోరిన ఎయిర్ఇండియా!
-
Ravichandran Ashwin అదృష్టమంటే అశ్విన్‌దే.. క్రికెట్ అభిమానులు సుడిగాడు అంటున్నారు!
-
TCS: టీసీఎస్ కీలక నిర్ణయం.. ‘హైబ్రిడ్’కు గుడ్‌బై..!
-
Baby: ‘బేబి’ విజయం.. దర్శకుడికి నిర్మాత బహుమానం.. అదేంటంటే?
-
ఐదేళ్ల RDపై వడ్డీ పెంపు.. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి వడ్డీ రేట్లు పాతవే
-
Yuvraj singh మేమంతా సచిన్ మాటే విన్నాం.. ఆ సలహా బాగా పని చేసింది: యువరాజ్