‘అఖిలప్రియకు బెయిల్‌ ఇవ్వొద్దు’

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో అరెస్టయి జైల్లో ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌పై సికింద్రాబాద్‌ కోర్టులో విచారణ

Updated : 09 Jan 2021 06:40 IST

కోర్టులో కౌంటర్‌ దాఖలు చేసిన పోలీసులు
ఆమె ఆరోగ్యపరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశం

హైదరాబాద్‌: బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో అరెస్టయి జైల్లో ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌పై సికింద్రాబాద్‌ కోర్టులో విచారణ జరిగింది. ఆమెకు బెయిల్‌ మంజూరు చేయొద్దని పోలీసులు కోర్టులో కౌంటరు దాఖలు చేశారు. అఖిలప్రియపై తప్పుడు కేసులు పెట్టే ఉద్దేశం తమకు లేదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో మరిన్ని సాక్ష్యాలు సేకరించేందుకు ప్రత్యేక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయని.. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేయాల్సి ఉందని చెప్పారు. అఖిలప్రియకు బెయిలిస్తే సాక్షులను బెదిరించే అవకాశముందని.. ఆమె చర్యల కారణంగా స్థానిక ప్రజల్లో అభద్రతాభావం నెలకొందని కోర్టుకు తెలిపారు. ఆమెకు ఆర్థికంగా, రాజకీయంగా కేసును ప్రభావితం చేయగలిగే పలుకుబడి ఉందన్నారు. 

అఖిలప్రియ బెయిల్‌పై విడుదలైతే దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు మరిన్ని నేరాలు చేస్తారని.. కేసు విచారణ నుంచి తప్పించుకోవచ్చని పోలీసులు న్యాయస్థానానికి వివరించారు. మరోవైపు అఖిలప్రియ ఆరోగ్య పరిస్థితిపై తక్షణమే నివేదిక ఇవ్వాలని జైలు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును సోమవారానికి వాయిదా వేసింది.

ఇవీ చదవండి..

‘సీఎం సార్‌.. దయచేసి అర్థం చేసుకోండి’

ఏ-1, ఏ-2లు ఎందుకు మారారు?


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని