Hyderabad: ఖైరతాబాద్‌లో కానిస్టేబుల్‌ వీరంగం.. మద్యం మత్తులో యువకులపై దాడి

మద్యం మత్తులో ట్రాఫిక్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించిన ఘటన ఖైరతాబాద్‌లో చోటుచేసుకుంది. సైఫాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌ బి.శ్రీనివాస్‌ మద్యం మత్తులో తన స్నేహితులతో కలిసి ఖైరతాబాద్ ఐమ్యాక్స్ ఎదురుగా ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల సముదాయం వద్ద హల్‌చల్‌ చేశాడు.

Published : 04 Oct 2022 19:33 IST

హైదరాబాద్: మద్యం మత్తులో ట్రాఫిక్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించిన ఘటన ఖైరతాబాద్‌లో చోటుచేసుకుంది. సైఫాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌ బి.శ్రీనివాస్‌ మద్యం మత్తులో తన స్నేహితులతో కలిసి ఖైరతాబాద్ ఐమ్యాక్స్ ఎదురుగా ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల సముదాయం వద్ద హల్‌చల్‌ చేశాడు. అంతటితో ఆగకుండా ద్విచక్ర వాహనంపై అటువైపుగా వెళ్తున్న యువకులపై దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌, అతని స్నేహితులపై బాధిత యువకుల బంధువులు సైఫాబాద్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts