Adibatla kidnap case: నవీన్‌రెడ్డితో పాటు మరో ఐదుగురు అరెస్టు.. కోర్టులో హాజరుపర్చిన పోలీసులు

వైశాలి కిడ్నాప్‌ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌పై ఇబ్రహీంపట్నం కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.

Updated : 14 Dec 2022 21:36 IST

హైదరాబాద్‌: ఆదిభట్ల పోలీసుస్టేషన్‌ పరిధిలోని మన్నెగూడకు చెందిన వైశాలి కిడ్నాప్‌ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌పై విచారణ ముగిసింది. ఈ కేసుకు సంబంధించి దాడిలో పాల్గొన్న 32 మంది హస్తినాపురం కేశవపురి కాలనీలోని మిస్టర్‌ టీ ప్రధాన కార్యాలయంలో శనివారం సమావేశమైనట్లు సమాచారం అందుకుని పోలీసులు వారిని అరెస్టు చేశారు.  వీరిలో నాగారం భానుప్రకాశ్‌ (20), రాథోడ్‌ సాయినాథ్‌ (22), గానోజి ప్రసాద్‌ (25), కోతి హరి (30), బోని విశ్వేశ్వర్‌రావు (26)లను కస్టడీకి ఇవ్వాలని ఆదిభట్ల పోలీసులు ఇబ్రహీంపట్నం కోర్టులో మంగళవారం పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం.. తీర్పును రేపటికి వాయిదా వేసింది.

ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి మంగళవారం గోవాలో పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. నవీన్‌ రెడ్డిని హైదరాబాద్‌ తీసుకొచ్చిన పోలీసులు.. వైద్య పరీక్షల అనంతరం ఇబ్రహీంపట్నం కోర్టులో హాజరుపర్చారు. నవీన్‌రెడ్డితో పాటు మరో ఐదుగురు నిందితులు చందు, ప్రవీణ్‌, ప్రకాశ్‌, మహేశ్‌, యశ్వంత్‌లను కూడా అరెస్టు చేసి ఇబ్రహీంపట్నం కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు 39 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు