Crime news: విద్యార్థి అరెస్టు.. కారణమేమిటంటే..

ఐఐటీ ఖరగ్‌పూర్‌కి బీటెక్‌ చదువుకోమని పంపిస్తే.. ఆ అబ్బాయి.. తప్పుదారి పట్టాడు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50మంది అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి జైలుపాలయ్యాడు. వివరాల్లోకి వెళ్లితే.. పుణెకు చెందిన మహవీర్‌ (19) ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్‌ చదువుతున్నాడు. దిల్లీలోని ఓ ప్రముఖ పాఠాశాలలోని బాలికలు, ఉపాధ్యాయులనే లక్ష్యంగా చేసుకొని.. యాప్స్‌పై తనకున్న అవగాహనతో వారికి దగ్గరవ్వడం ప్రారంభించాడు.

Published : 07 Oct 2021 22:57 IST

దిల్లీ: ఐఐటీ ఖరగ్‌పూర్‌కి బీటెక్‌ చదువుకోమని పంపిస్తే.. ఆ అబ్బాయి.. తప్పుదారి పట్టాడు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50మంది అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి జైలుపాలయ్యాడు. వివరాల్లోకి వెళ్లితే.. పుణెకు చెందిన మహవీర్‌ (19) ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్‌ చదువుతున్నాడు. దిల్లీలోని ఓ ప్రముఖ పాఠాశాలలోని బాలికలు, ఉపాధ్యాయులనే లక్ష్యంగా చేసుకొని.. యాప్స్‌పై తనకున్న అవగాహనతో వారికి దగ్గరవ్వడం ప్రారంభించాడు. దీనికోసం ఫేక్‌ కాలర్‌ ఐడీ యాప్స్‌తో పాటు వాట్సాప్‌లోని వర్చ్యూవల్‌ నంబర్స్‌ను వాడేవాడు. తనని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు వాయిస్‌ ఛేంజింగ్‌ యాప్‌ వాడి మాట్లాడేవాడు. అమ్మాయిలు తనకు దగ్గరైయ్యారని తెలిశాక.. వారి ఫొటోలను అడిగి వాటిని మార్ఫింగ్‌ చేసి.. వారి పేర్లతో ఫేక్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్స్‌ క్రియేట్‌ చేసి అందులో అప్‌లోడ్‌ చేసేవాడు. అలా చాలా ఫొటోలు సోషల్ మీడియా వేదికల్లో కనిపించడంతో.. అప్రమత్తమైన బుధవారం ఆ స్కూల్‌ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులను విచారించి.. గురువారం నిందితుడి పై పోక్సో సంబంధింత చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు డిప్యూటీ కమిషనర్‌ పోలీస్ సాగర్‌ సింగ్‌ కైలాశ్ తెలిపారు. దీని పై మరిన్ని వివరాలను తెలియజేస్తూ.. ‘‘ 33 వాట్సాప్‌ వర్చ్యువల్‌ నంబర్స్‌తో పాటు ఐదు ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్స్‌, ఫేక్‌ కాలర్‌ ఐడీ యాప్స్‌తో నిందితుడు అమ్మాయిలకు దగ్గరయ్యాడు. దీంతో మా టీమ్‌ వాట్సాప్‌, ఇన్‌స్టా, ఫేక్‌మెయిల్‌ ఐడీకి ఐపీ లాగిన్‌ ఐడీ వివరాలను దర్యాప్తు చేయగా.. అవి బిహార్‌లోని పట్నాకు చెందిన మహవీర్‌ అని తేలింది. వెంటనే అతడిని అరెస్టు చేసి అతడి వద్ద ఉన్న ఫొటోలు, ల్యాప్‌టాప్స్‌ని సీజ్‌ చేశాం’’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు