Bengaluru: నడిరోడ్డుపైనే పట్టుకుని.. రాళ్లతో మోది దారుణ హత్య!
కర్ణాటక రాజధాని బెంగళూరు(Bengaluru)లో దారుణ హత్యాఘటన వెలుగులోకి వచ్చింది. కొంతమంది కలిసి ఇటీవల ఓ వ్యక్తిని నడిరోడ్డుపైనే రాళ్లతో మోది హత్య చేయడం స్థానికంగా కలకలం రేపింది. నగరంలోని కేపీ అగ్రహార ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు(Bengaluru)లో దారుణ హత్యాఘటన వెలుగులోకి వచ్చింది. కొంతమంది కలిసి ఇటీవల ఓ వ్యక్తిని నడిరోడ్డుపైనే రాళ్లతో మోది హత్య చేయడం కలకలం రేపింది. నగరంలోని కేపీ అగ్రహార ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్‌గా మారింది. ఓ ఇంటి బయట ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు కలిసి ఓ 30 ఏళ్ల వ్యక్తితో గొడవ పడుతున్నట్లు వీడియోలో కనిపించింది. అంతలోనే అందులోని ఓ మహిళ.. రాయిని తీసుకొచ్చి అతనిపై దాడి చేసింది. ఆ సమయంలో మిగతావారంతా బాధితుడు ఎటూ పారిపోకుండా పట్టుకున్నారు.
ఈ క్రమంలోనే మిగతావారూ అతనిపై దాడికి దిగారు. రాళ్లతో పలుమార్లు అతని తలపై మోదారు. అనంతరం అక్కడినుంచి పరారయ్యారు. బాధితుడి కేకలు విని బయటకు వచ్చిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫోన్ చేశారు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుడు.. బాదామి ప్రాంతానికి చెందిన బాలప్పగా తెలుస్తోంది. మరోవైపు.. నిందితులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
మాజీ మంత్రి ముత్తంశెట్టికి చుక్కెదురు.. రోడ్డుకు అడ్డంగా చెప్పుల దండ కట్టి నిరసన
-
Politics News
Perni Nani: ‘జగన్ పిచ్చి మారాజు’
-
Politics News
Kumaraswamy: దేవేగౌడ తర్వాత నాకు కేసీఆరే స్ఫూర్తి: కుమారస్వామి
-
Politics News
Raghurama: వైకాపాలో తిరగబడే రోజులు మొదలయ్యాయి: ఎంపీ రఘురామ
-
World News
Rishi Sunak: రిషి సునాక్ 100 రోజుల ప్రతిన..
-
Crime News
Andhra News: వాగులో దూకి నిందితుడి పరారీ.. పోలీసులు గాలించినా లభించని ఆచూకీ