Crime news: లిఫ్ట్‌ ఇస్తానని చెప్పి.. 90 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం!

లిఫ్ట్‌ ఇస్తానంటూ 90 ఏళ్ల వృద్ధురాలిని బైక్‌పై ఎక్కించుకున్న ఓ గుర్తుతెలియని వ్యక్తి.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్‌లోని షాహ్‌డోల్‌ జిల్లాలో ఈ దారుణం వెలుగుచూసింది.

Published : 15 Jan 2023 01:22 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లో దారుణం చోటుచేసుకుంది. లిఫ్ట్‌ ఇస్తానని చెప్పి.. 90 ఏళ్ల వృద్ధురాలిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక్కడి షాహ్‌డోల్‌(Shadol) జిల్లాలో ఈ దుశ్చర్య వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలోని తన బంధువులను పరామర్శించేందుకుగానూ ఓ వృద్ధురాలు ఇటీవల జబల్‌పూర్ నుంచి షాహ్‌డోల్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చారు. అప్పటికే రాత్రి కావడంతో రైల్వేస్టేషన్‌లోనే ఉండిపోయారు. మరుసటి రోజు ఉదయం ప్రధాన రహదారిపై ఉన్న అంట్రా గ్రామానికి చేరుకున్నారు.

అక్కడినుంచి తాను వెళ్లాల్సిన ఊరి బస్సు కోసం ఎదురుచూస్తుండగా.. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆమెను పలకరించాడు. ఆ ఊరి వరకు లిఫ్ట్ ఇస్తానంటూ నమ్మించి, ఆమెను ఎక్కించుకున్నాడు. అయితే.. ఆమె వెళ్లాల్సిన ఊరికి కాకుండా, వేరే దారిలోకి తీసుకెళ్లాడు. ఆపై.. నిర్మానుష్య ప్రదేశంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం పరారయ్యాడు. చివరకు బంధువుల ఇంటికి చేరుకున్న ఆమె జరిగిందంతా చెప్పారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. గుర్తుతెలియని వ్యక్తిపై అత్యాచారం, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని