Published : 30 Dec 2021 01:26 IST

చోరీకి వాడిన రాడ్‌ కోసం గాలిస్తే...చోరీ అయిన 687సవర్ల నగలు దొరికాయి

పుదుక్కోట్టై: తమిళనాడులో ఓ వ్యక్తి ఇంట్లో సోమవారం 687 సవర్ల నగలు చోరీకి గురయ్యాయి.బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు చోరీ చేసేందుకు తలుపులు పగుల గొట్టేందుకు ఇనుప రాడ్‌ ఉపయోగించినట్లు నిర్ధారించారు.రాడ్‌ను దొంగలు బావిలో వేసి ఉండవచ్చిని దానిని గాలిస్తే విచారణ సులభమవుతుందని పోలీసులు బాధితులకు సలహా ఇచ్చారు. దీంతో రాడ్‌ కోసం గాలించిన బాధితులకు పోయిన బంగారు నగలు బావిలో లభించడం ఆశ్చర్యకరంగా మారింది. పోయిన నగలు దొరకడంతో వారు ఆనందంలో మునిగిపోయారు. పుదుక్కోట్టై జిల్లా గోపాలపట్నం గ్రామంలో జవహర్‌ సాధిక్‌ అనే వ్యక్తి ఇంట్లో బంగారం చోరీ జరిగింది.ఇంటి వెనుక తలుపులు పగలగొట్టి మేడపై స్టోర్‌ రూమ్‌లో ఉంచిన 687 సవర్ల నగలు చోరీకి గురైనట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. మంగళవారం డీఐజీ నేరుగా చోరీకి గురైన గోపాలపట్నంలోని బాధితుని ఇంటికి వెళ్లి పరిశీలించారు. జవహర్‌ సాధిక్‌ బంధువులు, ఇరుగు పొరుగు ఇళ్ల  వద్ద విచారణ నిర్వహించారు. సాధిక్‌ ఇంటి వెనుక తలుపులు తెరిచేందుకు ఉపయోగించిన ఇనుప రాడ్‌ను వెనుక వైపున ఉన్న బావిలో పడేసి ఉండవచ్చని డీఐజీ సాధిక్‌ బంధువులకు సూచించారు.దానిని వెంటనే  వెతికి కనిపెడితే విచారణ మరింత సులభమవుతుందని  తెలిపారు. దీంతో వారు బావిలో ఉన్న నీటిని మంగళవారం నుంచి తోడేపనులు చేపట్టారు.ఈ రోజు ఉదయం మొత్తం నీటిని తోడేయగా బావిలోని ప్లాస్టిక్‌ కవర్లో పోయిన 687 సవర్ల నగలు ఉండటం గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రాడ్‌ దొరుకుతుందని గాలించిన వారికి పోయిన నగలే దొరకడం ఆసక్తి కరంగా మారగా విలువైన నగలు దొంగతనం చేసిన వారు ఎందుకు బావిలో పడేసి ఉంటారు?ఎవరు చేసి ఉంటారు? అన్న అంశాలపై  విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని