Uttar Pradesh: చెరువులోకి దిగి నలుగురు చిన్నారుల మృతి..

ఓ చెరువులో స్నానానికి దిగి నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటుచేసుకుంది.

Published : 07 Jul 2024 23:50 IST

ఆగ్రా: ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లో దారుణం చోటుచేసుకుంది. అప్పటివరకు సరదాగా ఆడుతూ పాడుతూ గడిపిన నలుగురు చిన్నారులు.. చెరువులో దిగి అంతలోనే ప్రాణాలు కోల్పోయారు. వారిని కాపాడేందుకు మరో నలుగురు చిన్నారులు, ఓ మహిళ యత్నించి.. మరణం అంచులవరకు వెళ్లివచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఔరయా, కాన్పుర్‌కు చెందిన కొన్ని కుటుంబాలు ఆగ్రా జిల్లాలో ఖాందోలీలో నివసిస్తున్నాయి.

నల్ల డైరీ చెప్పిన గోల్‌ ‘మాల్‌’ కథ.. రూ.కోట్లలోనే కస్టమర్లకు సున్నం!

ఈ క్రమంలోనే 10-12 ఏళ్ల మధ్య వయసున్న నలుగురు బాలికలు స్నానం చేసేందుకు ఓ చెరువులో దిగారు. అంతలోనే నీటిలో మునిగిపోతుండటంతో.. గట్టుపై ఉన్న మరో నలుగురు పిల్లలు, ఓ మహిళ వారిని కాపాడేందుకు అందులోకి దిగారు. వారికీ అదే పరిస్థితి ఎదురుకాగా.. స్థానికులు వారిని కాపాడారు. మృతులను హీనా, ఖుషీ, చాందినీ, రియాగా గుర్తించారు. మిగతా ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని