టొరెంటోలో భారతీయ విద్యార్థి మృతి.. విదేశాంగ మంత్రి సంతాపం

టొరెంటోలో జరిగిన కాల్పుల్లో 21 ఏళ్ల భారతీయ విద్యార్థి గాయపడి, మరణించాడు. ఈ ఘటనపై విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ సంతాపం తెలియజేశారు. స్థానిక పోలీసులు కథనం

Updated : 09 Apr 2022 16:01 IST

దిల్లీ:  కెనడాలోని టొరెంటోలో జరిగిన కాల్పుల్లో 21 ఏళ్ల భారతీయ విద్యార్థి గాయపడి, మరణించాడు. ఈ ఘటనపై విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ సంతాపం వ్యక్తంచేశారు. స్థానిక పోలీసుల కథనం ప్రకారం... ఏప్రిల్‌ 7 సాయంత్రం టొరెంటో సమీపంలోని సబ్‌వే స్టేషన్‌లో కాల్పులు జరిగాయి. భారతీయ విద్యార్థి కార్తీక్‌ వాసుదేవ్‌ (21) సబ్‌వే వద్ద ఉండగా కొందరు నిందితులు కాల్పులు జరిపారు. అక్కడికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విద్యార్థి మరణించాడు.  ఈ ఘటన పట్ల జైశంకర్‌ ట్విటర్‌ వేదికగా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. కాల్పుల సమయంలో అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు, కెమెరా ఫుటేజ్‌ల సహకారంతో నిందితులను వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవలే తన కుమారుడితో ఫోన్‌లో మాట్లాడినట్టు మృతుడి తండ్రి తెలిపారు. తన భద్రతపై ఎలాంటి ఆందోళనా వద్లుదని, కెనడా సురక్షితమని కార్తీక్‌ తెలిపినట్టు ఆయన తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు