
Crime: నలుగురిని హత్య చేసిన ఇంటర్ విద్యార్థి
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన!
కోల్‌కతా: తల్లిదండ్రులతోపాటు మరో ఇద్దరు కుటుంబ సభ్యులను ఓ ఇంటర్ విద్యార్థి అతి దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ్ బెంగాల్ రాష్ట్రం మాల్దాలోని షేక్‌స్పియర్ ప్రాంతంలో నివసించే జావేద్ అలీ కుటుంబానికి అతడి చిన్న కుమారుడు ఆసిఫ్ మెహబూబ్ కాలయముడిగా మారాడు. తల్లి, తండ్రి, సోదరితో పాటు 62 ఏళ్ల వృద్ధురాలిని ఆసిఫ్ ఫిబ్రవరి 17న హత్య చేశాడు. అనంతరం సొంత ఇంటి ఆవరణలోనే వారిని పూడ్చిపెట్టాడు.
ఆసిఫ్ దాడి నుంచి తప్పించుకున్న అతడి సోదరుడు రాహుల్ షేక్ భయంతో ఇంతకాలం నోరు విప్పకపోవడంతో విషయం బయటకు పొక్కలేదు. అయితే ఆసిఫ్ అకృత్యాన్ని ఎట్టకేలకు బయటపెట్టాలని నిర్ణయించుకున్న రాహుల్.. కాలియాచోక్ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించటంతో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తొలుత రాహుల్ షేక్ మాటలపై సందేహం వ్యక్తం చేసిన పోలీసులు.. అనంతరం ఆసిఫ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. ఆసిఫ్ నిత్యం తన తండ్రి జావెద్‌ను డబ్బులకోసం డిమాండ్ చేసేవాడని స్థానికులు పేర్కొన్నారు. హత్యకు గల కారణాలపై అన్వేషిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.