వాటర్‌ ట్యాంకులో రూ.కోటి నగదు.. కంగుతిన్న ఐటీ అధికారులు

ఆదాయపు పన్ను శాఖ అధికారులకు చిక్కకుండా ఉండేందుకు మధ్యప్రదేశ్‌లోని ఓ వ్యాపారి.. రూ.కోటి నగదును అండర్‌ గ్రౌండ్‌ వాటర్‌ ట్యాంక్‌లో దాచాడు.

Published : 10 Jan 2022 01:52 IST

భోపాల్: ఆదాయపు పన్ను శాఖ అధికారులకు చిక్కకుండా ఉండేందుకు మధ్యప్రదేశ్‌లోని ఓ వ్యాపారి.. రూ.కోటి నగదును అండర్‌ గ్రౌండ్‌ వాటర్‌ ట్యాంక్‌లో దాచాడు. దామోహ్‌లో  మద్యం వ్యాపారి శంకర్‌ రాయ్‌, అతడి సోదరుల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేయగా.. వారి అక్రమార్జన బయటపడింది. పక్కా సమాచారంతో ఇల్లు మొత్తం సోదా చేసిన ఐటీ అధికారులు.. వాటర్‌ ట్యాంక్‌లో బ్యాగ్‌లో దాచిన నగదును స్వాధీనం చేసుకున్నారు. నీళ్లలో తడిసిన ఆ నోట్లను హెయిర్‌ డ్రైయర్‌తో ఆరబెట్టారు. ఈ సోదాల్లో మొత్తం రూ.8 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు.

Read latest Crime News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని