Terror Attack: కశ్మీర్‌లో చెలరేగిన ఉగ్రవాదులు.. దాడుల్లో భాజపా సర్పంచి మృతి

కశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు చెలరేగారు. అనంత్‌నాగ్‌లో సోమవారం జరిపిన దాడుల్లో భాజపా కిసాన్‌ మోర్చా కుల్గాం జిల్లా అధ్యక్షుడు గులాం రసూల్‌దర్‌, ఆయన భార్య మరణించారు.

Updated : 22 Aug 2022 17:12 IST

శ్రీనగర్‌: కశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు చెలరేగారు. అనంత్‌నాగ్‌లో సోమవారం జరిపిన కాల్పుల్లో భాజపా కిసాన్‌ మోర్చా కుల్గాం జిల్లా అధ్యక్షుడు గులాం రసూల్‌దర్‌, ఆయన భార్య మరణించారు. స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న క్రమంలో స్థానికంగా ఉగ్ర కార్యకలాపాలను కట్టడి చేసినట్లు పోలీసులు పేర్కొన్న గంటల వ్యవధిలోనే ఈ దాడి జరగడం గమనార్హం. మరోవైపు పార్టీ.. ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. అనాగరిక చర్యగా పేర్కొంది. కుల్గాంలోని రెడ్‌వానికి చెందిన గులాం. .  స్థానికంగా ఓ గ్రామానికి సర్పంచిగా వ్యవహరిస్తున్నారు. గతేడాది జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికల్లోనూ పోటీ చేశారు. జూన్‌లోనూ పుల్వామాలో భాజపా నేత, మున్సిపల్‌ కౌన్సిలర్ రాకేశ్ పండితను ఉగ్రవాదులు కాల్చి చంపిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని