
Published : 24 Jan 2022 02:00 IST
Crime News: జగిత్యాలలో మంత్రాల నెపంతో ముగ్గురుని హత్య చేసిన నిందితుల అరెస్ట్
జగిత్యాల: జగిత్యాలలో ఇటీవల జరిగిన సంచలనం సృష్టించిన మూడు హత్యలకు సంబంధించి పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. జగిత్యాలలో ఈ నెల 20న మంత్రాలు చేస్తున్నారనే నెపంతో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, ఇద్దరు కుమారులను ప్రత్యర్థులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. మృతి చెందిన వారిలో తండ్రి నాగేశ్వరరావు, ఇద్దరు కుమారులు రాంబాబు, రమేశ్ ఉన్నారు. దీంతో పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణించి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ రోజు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.9.42 లక్షలు, 6 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. వీరి హత్య కేసులో మొత్తం 24 మందిపై కేసులు నమోదయ్యాయి.
ఇవీ చదవండి
Tags :