Hyderabad: జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసు.. నిందితుల డీఎన్‌ఏ సేకరణకు కోర్టు అనుమతి

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్‌లో (Jubileehills) బాలికపై సామూహిక అత్యాచారం (Gang Rape) కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Published : 27 Jun 2022 11:56 IST

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్‌లో (Jubilee hills) బాలికపై సామూహిక అత్యాచారం (Gang Rape) కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితుల డీఎన్‌ఏ (DNA) సేకరించటానికి నాంపల్లి కోర్టు (Nampally Court) అనుమతినిచ్చింది. దీంతో పోలీసులు నిందితుల డీఎన్‌ఏను సేకరించి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపనున్నారు. అత్యాచారం జరిగినట్లు పోలీసులు తెలిపిన ఇన్నోవా వాహనంలో ఇప్పటికే అధికారుల బృందం ఆధారాలను సేకరించింది. ఇప్పుడు డీఎన్‌ఏ నమూనాలు సేకరించాక.. వాహనంలోని ఆధారాలతో అధికారులు పోల్చనున్నారు. ఘటన జరిగినప్పుడు నిందితులు ఇన్నోవాలోనే ఉన్నారా? లేరా? అనే విషయం నిర్ధరణకు డీఎన్‌ఏ పరీక్షలు ఎంతో కీలకంగా మారనున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అవసరమైతే బాధితురాలి డీఎన్‌ఏను సేకరించే యోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం.

మే 28వ తేదీన జరిగిన గ్యాంగ్‌ రేప్‌ ఘటనలో మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో సాదుద్దీన్‌(18) ప్రధాన నిందితుడు (ఏ-1) కాగా.. మిగిలిన అయిదుగురు మైనర్లు. ప్రస్తుతం సాదుద్దీన్‌ చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. మిగిలిన ఐదుగురు మైనర్లు సైదాబాద్‌లోని జువైనల్ హోమ్‌లో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని