Hyderabad: జూబ్లీహిల్స్‌ గ్యాంగ్ రేప్.. నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారణ

జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలిక అత్యాచారం కేసులో నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఇవాళ విచారణ జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ నాంపల్లి

Published : 21 Jun 2022 21:19 IST

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో 17 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఇవాళ విచారణ జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసు కస్టడీ ముగిసినందున బెయిల్ మంజూరు చేయాలని.. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని సాదుద్దీన్ తరఫు న్యాయవాది పిటిషన్‌లో పేర్కొన్నారు. ఐదుగురు మైనర్లు సైతం జువైనల్ జస్టిస్ బోర్డులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ ఇవ్వాలని నిందితుల తరఫు న్యాయవాదులు జువైనల్ జస్టిస్ బోర్డును కోరారు. అయితే కేసు దర్యాప్తు దశలో ఉన్నందున మైనర్లకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసుల తరఫు న్యాయవాది బోర్డు ఎదుట వాదనలు వినిపించారు. సమాజంలో పలుకుబడి ఉన్న మైనర్ల తల్లిదండ్రులు దర్యాప్తునకు ఆటంకం కలిగించే అవకాశం కూడా ఉండొచ్చని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇరువైపులా వాదనలు విన్న జువైనల్ జస్టిస్ బోర్డు తీర్పును రేపటికి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని