Published : 06/04/2021 09:14 IST

బ్యాట్లతో ట్రిపుల్‌ఐటీ విద్యార్థుల ఘర్షణ

ఇడుపులపాయ: కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీ ఆర్కే వ్యాలీలో విద్యార్థుల ఘర్షణ కలకలం రేపింది. ఇంజినీరింగ్‌ విద్యార్థులు బ్యాట్లు,  చైన్లు చేతబూని ఘర్షణకు దిగారు. ఇంజినీరింగ్‌ నాలుగో సంవత్సరం విద్యార్థులు ర్యాగింగ్‌ చేశారంటూ మూడో సంవత్సరం విద్యార్థులు నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలోనే ప్రసాద్‌ చంద్ర, తేజ, వంశీ, చరణ్‌, శివాజీ సహా మరికొందరు నాలుగో సంవత్సరం విద్యార్థులు జూనియర్ల వసతి గృహానికి వెళ్లారు. తమ వెంట తీసుకెళ్లిన క్రికెట్‌ బ్యాట్లు, సైకిల్‌ చైన్లు, ఇతర వస్తువులతో మూకుమ్మడిగా దాడి చేశారు. అధికారులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ సీనియర్లు లెక్కచేయకుండా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలో గాయపడ్డ మూర్తి, శేషు, రాజు అనే ముగ్గురు జూనియర్లను సిబ్బంది హుటాహుటిన స్థానిక ఆర్కే వ్యాలీ ఆసుపత్రికి తరలించారు. 

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని