Crim news: స్నానం చేస్తుండగా ఫోన్‌తో వీడియో తీశాడు: విద్యార్థినుల ఫిర్యాదు
హాస్టల్ విద్యార్థినులు స్నానం చేస్తుండగా తోటి విద్యార్థిని తీసిన వీడియోలు లీక్ కావడంతో ఇటీవల చండీగఢ్ యూనివర్సిటీ భగ్గుమన్న సంగతి తెలిసిందే. ఆ......
కాన్పూర్: హాస్టల్ విద్యార్థినులు స్నానం చేస్తుండగా తోటి విద్యార్థిని తీసిన వీడియోలు లీక్ కావడంతో ఇటీవల చండీగఢ్ యూనివర్సిటీ భగ్గుమన్న సంగతి తెలిసిందే. ఆ ఘటన జరిగి రెండు వారాలు గడవకముందే అదే తరహాలో మరో ఘటన యూపీలోని కాన్పూర్‌లో వెలుగుచూసింది. ఉత్తర్‌ప్రదేశ్ కాన్పూర్‌లోని ఓ హాస్టల్లో విద్యార్థినులు స్నానం చేస్తుండగా ఓ వ్యక్తి రహస్యంగా వీడియోలు తీయడం కలకలం రేపింది. తాము స్నానం చేస్తుండగా ఓ వ్యక్తి తన ఫోన్లో వీడియో తీశాడంటూ కొందరు విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు చర్యలు తీసుకోలేదంటూ గురువారం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వచ్చి వారంతా నిరసన తెలిపారు. కాన్పూర్‌లోని సాయి నివాస్ గర్ల్స్ హాస్టల్లో స్నానం చేస్తుండగా అక్కడి ఉద్యోగి బాత్రూమ్ కిటికీలోంచి ఫోన్‌తో అభ్యంతరకర వీడియోలు తీశాడని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు విద్యార్థినులు మీడియాకు తెలిపారు. దీనిపై స్పందించిన పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఆ ఉద్యోగిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. అలాగే, అతడి మొబైల్ ఫోన్‌ని ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెళ్లి కుమార్తెను తీసుకొచ్చేందుకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా
తెల్లవారితే తమ సమీప బంధువు ఇంట్లో జరిగే వివాహ వేడుకలో ఉత్సాహంగా పాల్గొనేవారు. ఇంతలోనే జరిగిన ప్రమాదం ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. -
మద్యానికి రూ.70 ఇవ్వలేదని కత్తిపోట్లు
మద్యం తాగేందుకు రూ.70 ఇవ్వలేదనే కారణంతో అందరూ చూస్తుండగానే స్నేహితుడిని కత్తితో పొడిచిన సంఘటన విజయవాడలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. -
చంద్రబాబు సభకు వెళ్లారని.. తెదేపా కార్యకర్తపై వైకాపా వర్గీయుడి దాడి
తెదేపా అధినేత చంద్రబాబు బహిరంగ సభకు వెళ్లాడన్న అక్కసుతో ఆ పార్టీ కార్యకర్తపై అధికార వైకాపా వర్గీయుడు దాడికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో మంగళవారం రాత్రి చోటు చేసుకొంది. -
సీఎంఆర్ఎఫ్ సొమ్ము రూ.10.50 లక్షలు స్వాహా
బాధితులకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్) చెక్కుల సొమ్ము రూ.10.50 లక్షలను కాజేసిన నలుగుర్ని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. -
ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దండకారణ్య ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చీపురుబట్టీ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు- మావోయిస్టుల మధ్య బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య
తమిళనాడులోని మదురై నుంచి వచ్చి జనగామలో స్థిరపడిన దంపతులు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. జనగామ పట్టణ సీఐ రఘుపతిరెడ్డి ఈ వివరాలు తెలిపారు. -
ఫోన్లో గట్టిగా మాట్లాడొద్దన్నందుకు కుమారుడిపై తండ్రి దాడి
ఫోన్లో గట్టిగా అరుస్తూ మాట్లాడొద్దని చెప్పినందుకు ఓ తండ్రి తన కుమారుడిపై తీవ్రంగా దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పుర్ జిల్లాలో చోటుచేసుకుంది. -
‘గ్రూప్-1’ ఉద్యోగాల పేరిట టోకరా!
నిరుద్యోగుల బలహీనతలను ఆసరాగా చేసుకొన్న ఓ ముఠా ‘గ్రూప్-1’ ఉద్యోగాల పేరుతో పలువురికి టోకరా వేసిన వైనం వెలుగులోకి వచ్చింది. -
తేనెటీగల దాడిలో పశువుల కాపరి మృతి
తేనెటీగల దాడిలో పశువుల కాపరి మృతిచెందిన సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. -
13 క్వింటాళ్ల పేలుడు పదార్థాల పట్టివేత
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్‌స్టేషన్ పరిధిలో 13 క్వింటాళ్ల పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. -
ఓక్రా, ఫైజల్ కస్టడీకి అనుమతి
పంజాగుట్ట డ్రగ్స్ కేసులో నిందితుడు నైజీరియా వాసి ఆంటోనియో ఒబింటా అలియాస్ ఓక్రాను నాలుగు రోజుల కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
కసబ్‌ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
చెప్పినా చెవికెక్కితేగా?వైకాపా ప్రచారాల్లో వాలంటీర్లు..
-
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!
-
గవర్నర్ పదవి త్యజించడం మంచిదే: తమిళిసై
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్‌లో నమోదైన రికార్డులివీ..