Crime news: నన్నే పెళ్లి చేసుకోనంటావా? ముక్కలుగా కోసి చంపుతా!
పెళ్లికి నిరాకరించిన మైనర్ బాలిక(17)ను చంపేస్తానంటూ బెదిరించిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది.
కాన్పూర్: తనతో పెళ్లికి నిరాకరించిన మైనర్ బాలిక(17)ను చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మహ్మద్ ఫయాజ్ అనే యువకుడు పదేపదే ఓ బాలిక వెంటపడుతుండేవాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ బలవంతపెట్టాడు. అయితే, అతడి ప్రతిపాదనను బాలిక నిరాకరించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన యువకుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. ‘పెళ్లి చేసుకోకపోతే.. నిన్ను ముక్కలుగా కోసి చంపుతా’ అని బెదిరించాడని బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. రోజూ స్కూల్‌కు వెళ్లే బాలికను ఫయాజ్ అనుసరిస్తూ పదే పదే వేధించేవాడని బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. అతడికి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించినా బాలికపై వేధింపులు మాత్రం ఆపలేదన్నారు. దీంతో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు.
బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఫయాజ్ ఇంటికి వెళ్లారు. అక్కడికి వెళ్లిన పోలీసులతో నిందితుడి కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగడంతో అదనంగా పోలీసులను రప్పించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. గత నెల 16న ఫిర్యాదు రావడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలుకు తరలించినట్టు తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Andhra News: భోగాపురం ఎయిర్పోర్ట్ వద్ద ఒబెరాయ్ సంస్థకు 40 ఎకరాలు!
-
Ap-top-news News
Vande Bharat Express: ‘వందే భారత్’ వచ్చినప్పుడే కాపలానా?
-
Ap-top-news News
రుషికొండపై వేంగి బ్లాక్ పూర్తికి టెండర్లు.. అక్కడే సీఎం క్యాంపు కార్యాలయం!
-
World News
US-China: 2025లో అమెరికా, చైనా మధ్య యుద్ధం?
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30/01/2023)
-
World News
ఐదు నెలలుగా విమానాశ్రయంలోనే.. రష్యన్ పౌరుల ‘ది టెర్మినల్’ స్టోరీ!