Crime News: విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో కిడ్నాప్‌ కలకలం

విశాఖ రైల్వే స్టేషన్లో ఏడాదిన్నర బాలుడి కిడ్నాప్‌ ఘటన కలకలం రేపింది. తల్లి నిద్రపోయిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బాలుడిని అపహరించారు. 

Updated : 08 Jun 2023 21:31 IST

విశాఖపట్నం: విశాఖ రైల్వే స్టేషన్లో ఏడాదిన్నర బాలుడి కిడ్నాప్‌ ఘటన కలకలం రేపింది. తెలంగాణలోని యాదాద్రి జిల్లా నుంచి నిన్న రాత్రి రైల్లో ఏడాదిన్నర కుమారుడితో కలిసి గర్భిణి విశాఖ చేరుకుంది. బుధవారం రాత్రి నుంచి విశాఖ రైల్వే స్టేషన్‌లోనే ఉంది. రైల్వే స్టేషన్‌లో తల్లి నిద్రపోయిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బాలుడిని అపహరించారు. తనతో పాటు స్టేషన్‌లో ఉన్న ఒడిశా జంట బాలుడిని కిడ్నాప్‌ చేశారని బాధితురాలు ఆరోపిస్తోంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు