Published : 26 May 2022 12:40 IST

అప్పు ఇచ్చిన మహిళనే హత్యచేసి..!

14 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు

ముంబయి‌: అప్పు ఇచ్చిన మహిళనే హత్య చేసి.. ఆ మృతదేహాన్ని పట్టాలపై పారేసిన యువకుడిని ముంబయి రైల్వే పోలీసులు 14 గంటల్లోనే అరెస్టు చేశారు. సీసీ కెమెరాలలో నిక్షిప్తమైన దృశ్యాల ఆధారంగా ఈ అరెస్టు చేసినట్లు వారు వివరించారు. డబ్బు వివాదం కారణంగానే ఆ మహిళను చంపినట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడు. పోలీసుల కథనం ప్రకారం...గోరేగావ్‌లో నివసిస్తున్నసారిక దామోదర్‌ చల్కే(30) ఒక ప్రైవేటు సంస్థలో పనిచేసేది. అక్కడే హౌస్‌కీపింగ్‌ విభాగంలో పనిచేస్తోన్న ఖైర్నార్‌ పలు విడతలుగా ఆమె వద్ద భారీ మొత్తాన్ని అప్పుగా తీసుకొన్నాడు. రుణం తిరిగి చెల్లించాల్సిందిగా ఆ మహిళ కోరాగా.. గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని ప్లాస్టిక్‌ సంచిలో కుక్కి మంగళవారం ఉదయం మహిమ్‌-మాతుంగా స్టేషన్‌ల మధ్య రైల్వే పట్టాలపై పడేశాడు.

 ట్రాక్‌పై మృతదేహాన్ని గుర్తించిన రైల్వే పోలీసులు.. దానిపై దాదాపు నాలుగు చోట్ల కత్తిపోట్లు ఉండటంతో హత్యగా భావించారు. మృతదేహాన్ని పారేయడానికి ఉపయోగించిన సంచులపై ‘హరి ఓం డ్రగ్‌, గోరేగావ్‌’ అని రాసి ఉండటాన్ని గుర్తించారు. దాని ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. అప్పటికే ఆమె ఆచూకీ కోసం భర్త ఫిర్యాదు చేయడంతో.. మృతురాలిని సారికగా గుర్తించారు. ఆమె పనిచేసే కార్యాలయంలో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా.. ఈ హత్యలో ఖైర్నార్‌ నిందితుడని తేలింది. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts