Insta Reels: చిందేసింది.. చిక్కుల్లో పడింది..

అటు ఇటు చూస్తే వేగంగా తిరుగుతున్న వాహనాలు. ఓ పక్క వాన.. మరో పక్క ఫ్లైఓవర్‌. అలాంటి చోటనే తను చిందులు వేసిందుకు వేదికగా మార్చుకుంది. చివరకు అదే చిక్కుల్లో పడేలా చేసింది.. వివరాల్లోకి వెళ్లితే.. కోల్‌కతాకి సాండీ సాహా అనే ట్రాన్స్‌జెండర్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 2లక్షల60వేలకు పైగా ఫాలోవర్స్‌. కొండ ప్రాంతాలు, నదీతీరాల్లో రీల్స్‌ చేసే ఈమె ఈసారి మాత్రం రద్దీగా ఉన్న ‘మా’ ఫ్లైఓవర్‌కి కారు

Updated : 23 Sep 2021 09:17 IST

కోల్‌కతా: అటు ఇటు చూస్తే వేగంగా తిరుగుతున్న వాహనాలు. ఓ పక్క వాన.. మరో పక్క ఫ్లైఓవర్‌. అలాంటి స్థలాన్ని తను చిందులు వేసేందుకు వేదికగా మార్చుకుంది. చివరకు అదే చిక్కుల్లో పడేలా చేసింది.. వివరాల్లోకి వెళ్లితే.. కోల్‌కతాకి సాండీ సాహా అనే ట్రాన్స్‌జెండర్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 2లక్షల60వేలకు పైగా ఫాలోవర్స్‌. కొండ ప్రాంతాలు, నదీతీరాల్లో రీల్స్‌ చేసే ఈమె ఈసారి మాత్రం రద్దీగా ఉన్న  ఫ్లైఓవర్‌పై కారు నుంచి దిగి చిత్రవిచిత్రమైన హావభావాలు పలికిస్తూ... డివైడర్‌ మీదకు వెళ్లి డ్యాన్స్‌ చేయడం మొదలెట్టింది. వీటిని ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఇక ఫేస్‌బుక్‌లో సాహా చేష్టలను చూసిన ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూమ్‌ సిబ్బంది సీసీటీవీ ఫుటేజీ ద్వారా కారు ఓనర్‌ని గుర్తించారు. అది సాహాదే అని తేలడంతో... ఆమెపై కేసు ఫైల్‌ చేశారు. ఈ వీడియోని చూసిన నెటిజ్లను అసహనం వ్యక్తం చేశారు. ఇటీవలే ఇండోర్‌కి చెందిన శ్రేయా కల్రా రెడ్‌ సిగ్నల్‌ పడినప్పుడు రోడు మీదకొచ్చి డ్యాన్స్‌ చేసింది.. అది పోలీసుల దృష్టికి వెళ్లడంతో ట్రాఫిక్ రూల్స్‌ అతిక్రమించిందని ఆమెపై కేసు నమోదు చేశారు. ఫేమస్ కావడం కోసం, వ్యూస్‌, లైకుల కోసం ఇలాంటి వీడియోలు చేయొద్దని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని