crime news: ముంబయిలో నడిరోడ్డుపై కొరియన్ యూట్యూబర్‌తో అసభ్య ప్రవర్తన..!
ముంబయిలో నడిరోడ్డుపై ఓ మహిళా యూట్యూబర్ వేధింపులకు గురయ్యారు. దీంతో ముంబయి పోలీసులు రంగంలోకి దిగారు.
ఇంటర్నెట్‌డెస్క్: దక్షిణ కొరియాకు చెందిన ఓ యూట్యూబర్ ముంబయిలోని ఓ వీధిలో బహిరంగంగానే వేధింపులకు గురైంది. లైవ్‌స్ట్రీమింగ్ చేస్తుండగా ఓ ఆకతాయి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
మయోచి అనే యూట్యూబర్ మంగళవారం రాత్రి ముంబయిలోని రద్దీగా ఉన్న ఓ వీధిలో లైవ్‌స్ట్రీమ్ చేస్తోంది. ఆ సమయంలో అక్కడ వందల మంది తిరుగుతున్నారు. అప్పుడు ఇద్దరు యువకులు బైక్‌పై అక్కడకు వచ్చి లిఫ్ట్ ఇస్తామంటూ ఆమె చెయ్యి పట్టుకొని బలవంతంగా లాగారు. ఆమెకు ఏమి చేయాలో అర్థం కాక ‘ఇంటికి వెళ్లాలని’ వారిని వారిస్తూ వెళ్లిపోబోయింది. అంతలో ఓ యువకుడు ఆమెని ముద్దుపెట్టుకోబోయాడు. అతడిని వదిలించుకొని మయోచి ముందుకు వెళ్లిపోయింది. అప్పటికీ ఆ యువకులు ఆమెను వదల్లేదు. ఓ స్కూటర్‌పై ఆమె వెనుకే వచ్చి మళ్లీ వాహనం ఎక్కాలంటూ బలవంతం చేశారు. కానీ, ఆమె నిరాకరించింది.
ఈ వీడియోను ఆదిత్య అనే వ్యక్తి ట్వీట్ చేశారు. దీనిని మయోచి రీట్వీట్ చేస్తూ.. ‘‘అక్కడ ఓ యువకుడు నన్ను వేధించాడు. విషయం పెద్దది కాకముందే అక్కడి నుంచి వచ్చేశాను. ఎందుకంటే వారు ఇద్దరు ఉన్నారు. నేను స్నేహపూర్వకంగా సంభాషించడం వల్లే ఇలా జరిగిందని కొందరు అంటున్నారు. ఈ ఘటనతో ఇక, నేను వీధుల్లో లైవ్‌స్ట్రీమ్ చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలేమో’’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. దీనికి ముంబయి పోలీసులు ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘మీరు చెప్పిన దానిని పరిశీలిస్తాం. మీరు నేరుగా మాకు సమాచారం పంపండి’’ అని ట్వీట్ చేశారు. దీనికి మయోచి స్పందిస్తూ.. ‘‘మీకు మెసేజ్ చేసే మార్గం నాకు కనిపించలేదు. మీరు నేరుగా మెసేజ్ చేయండి. దాని ఆధారంగా మీకు అవసరమైన సమాచారం ఇవ్వగలను’’ అని ట్వీట్ చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Aishwaryaa: రజనీకాంత్ కుమార్తె నివాసంలో భారీ చోరీ
-
Politics News
TDP: దమ్ముంటే సభలో జరిగిన పరిణామాలపై వీడియోలను బయటపెట్టాలి: తెదేపా ఎమ్మెల్యేలు
-
Politics News
Chandrababu: జగన్ ప్రోద్బలంతోనే సభలో మా ఎమ్మెల్యేలపై దాడి: చంద్రబాబు
-
Sports News
MS Dhoni : ధోనీ బటర్ చికెన్ ఎలా తింటాడంటే.. ఆసక్తికర విషయాలు చెప్పిన ఉతప్ప
-
India News
Amritpal Singh: అమృత్‌పాల్‌కు దుబాయ్‌లో బ్రెయిన్‌వాష్.. జార్జియాలో శిక్షణ..!
-
Politics News
Mamata Banerjee: ఆయన విపక్షాలను నడిపిస్తే.. మోదీని ఎదుర్కోలేం..!