‘మదనపల్లె కేసులో అనుమానాలున్నాయ్’

చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో అనుమానాలున్నాయని న్యాయవాది రజిని అభిప్రాయం వ్యక్తం చేశారు. మదనపల్లె సబ్‌ జైలులో ఉన్న నిందితులను కలిసేందుకు

Published : 31 Jan 2021 01:37 IST

నిందితులను కలిసేందుకు యత్నించిన న్యాయవాది రజిని

మదనపల్లె: చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో అనుమానాలున్నాయని న్యాయవాది రజిని అన్నారు. మదనపల్లె సబ్‌ జైలులో ఉన్న నిందితులను కలిసేందుకు శనివారం ఆమె ప్రయత్నించారు. అయితే, నిందితులను నేరుగా కలిసేందుకు అధికారులు ఆమెకు అనుమతివ్వలేదు. దీంతో జైలు ద్వారం వద్ద దూరంగా నిలబడి నిందితుల్లో ఒకరైన పురుషోత్తంనాయుడుతో కొన్ని నిమిషాల పాటు మాట్లాడారు. అనంతరం సోమవారం రావాలని చెప్పి జైలు అధికారులు న్యాయవాదిని పంపించేశారు.

అనంతరం రజిని మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది కృష్ణమాచార్య తరఫున నిందితులను కలిసేందుకు వచ్చినట్లు చెప్పారు. ‘‘నిందితులకు న్యాయసహాయం అవసరమని భావిస్తున్నాం. జంట హత్యల కేసులో అనుమానాలు చాలా ఉన్నాయి. హత్యాస్థలంలోని దృశ్యాలు క్షుద్రపూజలవి కావు. ఈ కేసులో హత్యలకు, నిందితుల ఆధ్యాత్మిక చింతనకు సంబంధం ఉండక పోవచ్చు. రుద్రుడు, క్షుద్రుడు అనే రెండు వేర్వేరు విషయాలను చూపిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగు చూడాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు.
 

ఇవీ చదవండి..

యూపీలో ఘోర ప్రమాదం.. 10 మంది మృతి

‘కాళికనని.. నాలుక కోసి తినేసింది’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు