ప్రేయసి కాదందని.. ఆత్మహత్యాయత్నం 

ప్రేమించిన యువతితో విభేదాల కారణంగా ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు యత్నించిన ఘటన గుంటూరులో

Updated : 24 Mar 2021 13:04 IST

గుంటూరు: ప్రేమించిన యువతితో విభేదాల కారణంగా ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు యత్నించిన ఘటన గుంటూరులో కలకలం రేపింది. నరసరావుపేట మండలం గురవాయిపాలేనికి చెందిన మహేశ్‌  బీటెక్‌ పూర్తి చేసి దిల్లీలోని నోయిడాలో ఉద్యోగం చేస్తున్నాడు. చదువుకునే సమయంలో ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆపరిచయం కాస్తా ప్రేమగా మారింది. వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు కానీ.. సెలవులపై వచ్చిన మహేశ్‌  గుంటూరులో ఆత్మహత్యకు యత్నించాడు. 

గోరంట్లలోని ఐడీ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న ఓ లాడ్జిలో గది తీసుకుని...కూల్‌డ్రింక్‌లో ఎలుకల మందు కలిపి తాగాడు. అనంతరం బ్లేడ్‌తో చేయి కోసుకుని రక్తం పోవడాన్ని వీడియో తీసి కుటుంబ సభ్యులకు పంపాడు. గదిలో  నుంచి శబ్దాలు రావడంతో గమనించిన లాడ్జి సిబ్బంది తలుపులు పగులగొట్టి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న నల్లపాడు పోలీసులు 108లో యువకుడిని జీజీహెచ్‌కు తరలించారు. అనంతరం అతని కుటుంబ సభ్యులు వచ్చి ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఘటనపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని