రూ.కోటి విలువచేసే ఫ్లాటు.. ఆడీ కారు.. పోలీసులకు చిక్కిన దర్జాదొంగ

గుజరాత్‌ పోలీసులు ఇటీవల ఓ చోరీ కేసులో రోహిత్‌ కానుభాయ్‌ సోలంకి అనే దొంగను అరెస్టు చేశారు. విచారణలో భాగంగా వెల్లడైన విషయాలు వారిని విస్తుపోయేలా చేశాయి.

Updated : 07 Jul 2024 07:53 IST

విమానాల్లో ప్రయాణం, స్టార్‌ హోటళ్లలో బస

గాంధీనగర్‌: గుజరాత్‌ పోలీసులు ఇటీవల ఓ చోరీ కేసులో రోహిత్‌ కానుభాయ్‌ సోలంకి అనే దొంగను అరెస్టు చేశారు. విచారణలో భాగంగా వెల్లడైన విషయాలు వారిని విస్తుపోయేలా చేశాయి. రోహిత్‌ను వివిధ రాష్ట్రాల్లో జరిగిన 19 దొంగతనాల్లో నిందితుడిగా గుర్తించారు. ఇందులో తెలంగాణాలో రెండు, ఆంధ్రప్రదేశ్‌లో రెండు చోరీ కేసులు కూడా ఉన్నాయి. ముంబయిలో నిందితుడికి కోటి రూపాయలకు పైగా విలువచేసే ఫ్లాటు, ఆడీ కారు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇతడు విమానాల్లో వివిధ రాష్ట్రాలకు తిరుగుతూ, అక్కడున్న విలాసవంతమైన హోటళ్లలో బస చేస్తాడని తెలిపారు. పగటిపూట ఆయా ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి రాత్రిళ్లు దొంగతనాలకు పాల్పడుతుంటాడన్నారు. ముంబయిలోని డ్యాన్స్‌ బార్‌లు, నైట్‌క్లబ్‌లకు అలవాటుపడిన రోహిత్‌ డ్రగ్స్‌ తీసుకుంటాడని చెప్పారు. అంతేకాదు.. ఓ ముస్లిం మహిళను పెళ్లి చేసుకునేందుకు తన పేరు అర్హన్‌గా మార్చుకున్నాడు. ఇంత దర్జాగా చోరీలకు పాల్పడుతూ వచ్చిన రోహిత్‌ ఓ ఇంట్లో రూ.లక్ష చోరీ చేసిన కేసులో గుజరాత్‌ పోలీసులకు చిక్కాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని