మహిళ అనీ చూడలేదు.. చెట్టుకు కట్టేసి..!
ఆమెకు 19 ఏళ్లు.. మూడు నెలల క్రితమే పెళ్లయింది. మెట్టింట్లో ఏమైందో ఏమో.. కన్నవారు ఉన్నారన్న ధైర్యంతో పుట్టింటికి వచ్చింది. చేరదీయాల్సిన బంధువులే రాబందుల్లా మారారు. అత్యంత కిరాతకంగా జుట్టుపట్టి ఈడ్చి ఈడ్చి కొట్టారు...
భోపాల్: ఆమెకు 19 ఏళ్లు. మూడు నెలల క్రితమే పెళ్లయింది. మెట్టింట్లో ఏమైందో ఏమో.. కన్నవారు ఉన్నారన్న ధైర్యంతో పుట్టింటికి వచ్చింది. చేరదీయాల్సిన బంధువులే రాబందుల్లా మారారు. అత్యంత కిరాతకంగా జుట్టుపట్టి ఈడ్చి ఈడ్చి కొట్టారు. కర్ర విరిగేంత వరకు గొడ్డును బాదినట్లు బాదారు. అక్కడితోనూ ఆగలేదు. చెట్టుకు కట్టేసి పాశవిక ఆనందం పొందారు. తల్లిదండ్రులు, చిన్నాన్నలు, పెదనాన్నల కళ్లెదుటే ఇంత జరుగుతున్నా వారంతా మౌనంగా ఉండిపోవడం గమనార్హం. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. బాధితురాలు ఎస్టీ సామాజిక వర్గానికి చెందినదిగా సమాచారం.
మూడు నెలల క్రితం బాధిత మహిళకు ఆలీరాజ్పూర్నకు చెందిన వ్యక్తితో వివాహమైంది. అక్కడ ఏం జరిగిందో తెలియదు గానీ, గత నెల 28న ఆమె పుట్టింటికి వచ్చేసింది. దీంతో కోపోధ్రిక్తులైన కుటుంబీకులు ఆమెను విచక్షణా రహితంగా హింసించారు. ‘ఇంకెప్పుడైనా ఇలా వచ్చేస్తావా?’ అంటూ కర్ర విరిగిపోయేదాకా చావబాదారు. ఈ ఘటనను అక్కడున్న కొందరు మొబైల్స్‌లో రికార్డు చేశారు. అది కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో స్థానిక పోలీసులు స్పందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆమె తండ్రి, కొందరు బంధువులపై కేసు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్‌కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్‌రెడ్డి రైస్‌మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్‌హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)