
Crime news: ‘వాట్సాప్ స్టేటస్’ చూసి యువతి తల్లిని కొట్టి చంపిన వైనం!
ముంబయి: ఓ యువతి వాట్సాప్ స్టేటస్ ఆమె తల్లికి మృత్యుపాశమైంది. ఆ పోస్టు చూసిన ఓ స్నేహితురాలు.. బంధువులతో కలిసి యువతితోపాటు ఆమె తల్లిపై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ తల్లి ఆసుపత్రిలో ప్రాణాలు విడిచింది. మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బోయ్సార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువతి (20) తల్లి లీలావతి దేవి (48)తో కలిసి జీవిస్తోంది. సదరు యువతి ఈనెల 10వ తేదీన తన వాట్సాప్ స్టేటస్‌లో ఓ మెసేజ్ పోస్ట్ చేసింది. అయితే ఆ స్టేటస్ తన గురించే అని భావించిన ఆమె స్నేహితురాలు.. విషయాన్ని తల్లి, సోదరులకు తెలియజేసింది. నిజానిజాలు తెలుసుకోకుండా కోపంతో ఊగిపోయిన వారంతా అదేరోజు లీలావతి ఇంటికి వెళ్లి గొడవకు దిగారు. తల్లి, కుమార్తెపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన లీలావతి దేవి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతిచెందింది.
ఘటనపై విచారణ చేపట్టిన బోయ్సార్ పోలీసులు సోమవారం ఈ వివరాలను వెల్లడించారు. ఆ ‘వాట్సాప్ స్టేటస్’ స్నేహితురాలిని ఉద్దేశించి పోస్టుచేసింది కాదని, అదో సాధారణమైన పోస్టేనని స్పష్టం చేశారు. మృతురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
social look: లవ్‌లో పడిన రష్మి.. జిమ్‌లో పడిన విద్యురామన్.. ‘శ్రద్ధ’గా చీరకడితే..
-
Sports News
Ravi Shastri : అప్పుడు ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు వాయిదా వేయడం.. సమర్థనీయమే: రవిశాస్త్రి
-
Politics News
BJP: మోదీ మరో 20ఏళ్ల పాటు పాలన అందించాలి... కార్యవర్గ భేటీలో నేతల అభిప్రాయం
-
General News
Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
-
Movies News
Sushmita Sen: మహేశ్‌భట్ మాటలతో మొదట బాధపడ్డా..
-
General News
Cafe: ప్లాస్టిక్ వ్యర్థాలు ఇవ్వండి.. రుచికరమైన భోజనం అందిస్తాం.. ఓ కేఫ్ వినూత్న ప్రకటన
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- చిన్న బడ్జెట్.. సొంత గూడు
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- IND vs ENG: జడేజా సెంచరీ.. బుమ్రా సంచలనం.. టీమ్ఇండియా భారీ స్కోర్
- Russia: ముప్పేట దాడులు తాళలేకే?.. స్నేక్ ఐలాండ్‌ను విడిచిన రష్యా
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02-07-2022)
- తెదేపాలో చేరితే రూ.30 కోట్లు ఇస్తామన్నారు
- Rishabh Pant : అతనే.. ఆపద్బాంధవుడు
- Viral video: వారెవ్వా.. ఏం టాలెంట్.. మహిళకు నెటిజన్ల ప్రశంసలు!
- Rishabh pant : విమర్శలకు బెదరని నయా ‘వీరు’డు.. రిషభ్ పంత్
- IND vs ENG : పంత్ ఒక్కడు ఒకవైపు..