
Crime News: మహేశ్ బ్యాంక్ సర్వర్ హ్యాకింగ్ కేసులో వీడని చిక్కుముడి
హైదరాబాద్: ఏపీ మహేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్ ప్రధాన సర్వర్‌ను హ్యాక్ చేసిన కేసులో చిక్కుముడి వీడలేదు. ఇప్పటి వరకు ఆధారాలు లభించకపోవడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ హ్యాకింగ్ కేసు సవాలుగా మారింది. సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిన మూడు ఖాతాల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. బ్యాంకింగ్ రంగానికి హ్యాకింగ్ వల్ల ముప్పు ఉండటంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా మహేశ్ బ్యాంక్ ఘటనపై దృష్టిసారించాయి. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు నుంచి కేంద్ర సైబర్ సెక్యూరిటీ విభాగం వివరాలు సేకరించింది.
కేంద్ర సైబర్ సెక్యూరిటీ విభాగాన్ని సమన్వయం చేసుకుంటూ సైబర్ క్రైమ్ అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ఖాతాలకు నగదు బదిలీ కావడంపై మహేశ్ బ్యాంక్‌లో నిర్వహణ లోపాలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇటీవల గంటల వ్యవధిలోనే సైబర్ కేటుగాళ్ల మహేశ్ బ్యాంకులో రూ.12.9 కోట్లు కొల్లగొట్టిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
Advertisement