భువనేశ్వర్‌లో భారీ అగ్ని ప్రమాదం

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో రాజ్‌భవన్‌కు సమీపంలో ఉన్న ఐవోసీఎల్‌ పెట్రోల్‌ బంకులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి....

Published : 08 Oct 2020 01:58 IST

(ప్రతీకాత్మక చిత్రం)

ఇంటర్నెట్‌ డెస్క్: ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో రాజ్‌భవన్‌కు సమీపంలో ఉన్న ఐవోసీఎల్‌ పెట్రోల్‌ బంకులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్‌ కాలేజ్‌కు తరలించారు. ఘటనా స్థలికి మూడు అగ్నిమాపక వాహనాలు చేరుకుని మంటలను అదుపుచేశాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

ఘటనా స్థలంలో పెట్రోల్‌, డీజిల్‌తో నిండి ఉన్న మరో రెండు ట్యాంకులు ఉన్నాయని, వాటి వైపు మంటలు విస్తరించకుండా ఉండటానికి తాము ప్రాధాన్యం ఇచ్చామని పోలీస్ కమిషనర్‌ సారంగి వివరించారు. ఆ రెండు ట్యాంకులను తక్షణమే ఖాళీ చేయించడానికి చర్యలు తీసుకోవాలని ఐఓసీఎల్కు సూచించినట్లు తెలిపారు. ప్రమాదం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్.. గాయపడిన వారి చికిత్సకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు