Updated : 14 May 2022 15:40 IST

Shahana: నటి అనుమానాస్పద మృతి.. అల్లుడే చంపేశాడు: నటి తల్లి

తిరువనంతపురం: పుట్టినరోజు నాడే ఓ నటి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళలోని కాసర్‌గోడ్‌కు చెందిన షహనా(20) మోడల్‌గా మంచి పేరు సొంతం చేసుకున్నారు. పలు వస్త్రాభరణాల సంస్థలకు మోడల్‌గా చేశారు. ఇలా రాణిస్తూనే సినిమాల్లోకి వెళ్లాలని ఎన్నో కలలు కన్న షహనాకు రెండేళ్ల క్రితం సజ్జద్‌ అనే వ్యక్తితో వివాహమైంది. కొయ్‌కోడ్‌ సమీపంలోని ఓ ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. గురువారం రాత్రి ఆ అపార్ట్‌మెంట్‌ కిటికీ ఊచలకు షహనా మృతదేహం వేలాడుతూ కనిపించింది. దీన్ని గుర్తించిన స్థానికులు వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కుమార్తె మృతితో షహనా కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అల్లుడే ఆమెని హత్య చేసి ఉంటాడని షహనా తల్లి ఆరోపణలు చేశారు. ‘‘నా కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. ఆమె హత్యకు గురైంది. నాకు ఫోన్‌ చేసిన ప్రతిసారీ షహనా ఏడుస్తుండేది. భర్త తనని వేధింపులకు గురి చేస్తున్నాడని.. తాగొచ్చి డబ్బులు కావాలంటూ కొడుతున్నాడని, కొన్నిసార్లు తనకి అన్నం కూడా పెట్టడంలేదని చెప్పింది. అత్తింటివాళ్లే నా కుమార్తెను చంపేశారు’’ అని షహనా తల్లి చేసిన ఆరోపణలతో పోలీసులు సజ్జద్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని