ఏసీపీ నరసింహారెడ్డి అరెస్టు

అక్రమాస్తుల కేసులో మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి ఆయనను తరలించారు. గురువారం ఉదయం అ.ని.శా కోర్టులో నరసింహారెడ్డిని ప్రవేశపెట్టనున్నారు.

Published : 24 Sep 2020 01:09 IST

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి ఆయనను తరలించారు. గురువారం ఉదయం అ.ని.శా కోర్టులో నరసింహారెడ్డిని ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు ఏసీపీ నరసింహారెడ్డి నివాసం సహా ఆయన బంధువుల ఇళ్లలో అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) అధికారులు సోదాలు చేశారు. ఏకకాలంలో 25 చోట్ల తనిఖీలు చేపట్టారు. వరంగల్‌, కరీంనగర్‌, నల్గొండ, అనంతపురంలో తనిఖీలు చేశారు. ఇప్పటి వరకు చేపట్టిన తనిఖీల్లో సుమారు రూ.70కోట్ల ఆస్తులను ప్రాథమికంగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

 సికింద్రాబాద్‌ మహేంద్రహిల్స్‌లోని నరసింహారెడ్డి ఇల్లు.. ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో అధికారులు సోదాలు చేశారు. నరసింహారెడ్డికి హైదరాబాద్‌లో 3 ఇళ్లు, 5 ఇంటిస్థలాలు ఉన్నట్లు గుర్తించినట్లు ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్‌ రవీందర్‌రెడ్డి తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని