Crime News: కార్ ట్రావెల్స్ పెట్టాలన్న కోరికే డ్రైవర్ కొంపముంచింది
కార్ ట్రావెల్స్ పెట్టాలన్న ఓ వ్యక్తి కోరికే అతడి కొంపముంచింది. ట్రావెల్స్ పెట్టడానికి ఏకంగా కార్లనే దొంగతనం చేయాలని తలచి.. మొదటి కారు దొంగతనంలోనే పోలీసులకు చిక్కాడు.
పల్నాడు: కార్ ట్రావెల్స్ పెట్టాలన్న ఓ వ్యక్తి కోరికే అతడి కొంపముంచింది. ట్రావెల్స్ పెట్టేందుకు ఏకంగా కార్ల దొంగతనాలకే దిగాడు ఆ ప్రబుద్ధుడు. మొదటి కారు దొంగతనంలోనే పోలీసులకు చిక్కి.. చివరకు కటకటాలపాలయ్యాడు. నిందితుడు సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లరానికి చెందిన షేక్ మస్తాన్ వలి అని పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి తెలిపారు. నరసరావుపేటలోని ఎస్పీ కార్యాలయంలో ఆయన శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
షేక్ మస్తాన్ వలి తాపీ మేస్త్రీగా పని చేసి కొంతకాలం క్రితం పని మానేశాడు. తర్వాత హైదరాబాద్‌లోని ఓ ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా చేరాడు. అలా పని చేస్తున్న అతడికి తను కూడా ఓ ట్రావెల్స్ పెట్టాలనే ఆలోచనకు వచ్చాడు. ఈ క్రమంలో తన వద్ద డబ్బులేకపోవడంతో కార్లు దొంగతనాలు చేయాలనుకున్నాడు. వెంటనే బొల్లారం నుంచి ఇద్దరు తాపీ పని చేసే వారిని మాట్లాడుకుని హైదరాబాద్‌లో పని ఉందంటూ తీసుకువచ్చాడు. వారిలో ఒకరి వద్ద నుంచి మస్తాన్ వలి ఫోన్ తీసుకుని వెళ్లాడు. అదే అదునుగా మొదట ప్రణాళిక రూపొందించుకున్నాడు.
విజయవాడలోని శైలజ ట్రావెల్స్‌లో వీఐపీలకు మాత్రమే కార్లు ఇస్తారని తెలుసుకుని దొంగిలించిన ఫోన్ ద్వారా జస్ట్ డయల్‌కు ఫోన్ చేశాడు. వీ.ఎస్ రావు అనే పేరుతో ఈనెల 20వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు రోజుకు రూ.8 వేలకు కారు బుక్ చేసుకున్నాడు. గన్నవరం నుంచి కారు బుక్ చేసుకోవడంతో ఆ ట్రావెల్స్ యజమానులు కారును షాజీత్ అనే డ్రైవర్‌తో పంపించారు. నిందితుడు మస్తాన్ వలిని గన్నవరంలో ఎక్కించుకున్న డ్రైవర్.. నరసరావుపేట గాంధీ పార్క్ సెంటర్ వద్దకు చేరుకున్నాడు. అక్కడ డ్రైవర్ షాజీత్‌కు రూ.1500 ఇచ్చి బిర్యానీ తీసుకు రమ్మని చెప్పడంతో డ్రైవర్ అక్కడే కారును ఉంచి వెళ్లాడు. ఆ మరుక్షణమే కారును దొంగిలించుకుపోయాడు.
ట్రావెల్స్ యజమాని యుగంధర్ ఫిర్యాదుతో నరసరావుపేట ఒకటో పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోన్ నెంబర్, టెక్నాలజీ ఆధారంగా పరిశీలిస్తే నిందితుడు షేక్ మస్తాన్ వలిగా గుర్తించారు. దొంగిలించిన కారు నెంబరును మార్చి నగరంలో తిప్పుతున్నాడని వెల్లడించారు. హైదరాబాద్‌లో నిందితుడు మస్తాన్ వలిని నరసరావుపేట పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడిని ఐదు రోజుల్లో పట్టుకున్న ఒకటో పట్టణ సీఐ అశోక్ కుమార్, రెండో పట్టణ సీఐ వీరేంద్ర బాబు, ఎస్సై వెంకటేశ్వర్లు, సిబ్బందిని పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Pawan Kalyan: పవన్‌కు కృష్ణా జిల్లా ఎస్పీ నోటీసులు
-
కేబినెట్ ఆమోదం పొందాకే అమల్లోకి సీమెన్స్ ప్రాజెక్టు: చంద్రబాబు తరఫు న్యాయవాది వాదనలు
-
ODI WC 2023: అశ్విన్ ఎంపికపై భజ్జీ కామెంట్లు.. నెట్టింట మరోసారి సంజూ వైరల్!
-
Lalu Prasad Yadav: భూ కుంభకోణం కేసులో లాలూకు స్వల్ప ఊరట
-
Supreme Court: ఈడీ ప్రతీకార చర్యలకు పాల్పడకూడదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
CISF constable: దిల్లీలో చీపురుపల్లి కానిస్టేబుల్ ఆత్మహత్య