Published : 14 Sep 2021 01:47 IST

HIV infected needle: ఇలాంటి భర్త లోకంలో ఉంటాడా.. గర్భిణి భార్యకు హెచ్​ఐవీ ఇంజెక్షన్​ ఇచ్చిన భర్త

అలీగఢ్​: ఉత్తర్​ప్రదేశ్​లో ఓ భర్త అమానవీయ చర్యకు పాల్పడ్డాడు. హెచ్​ఐవీ రోగికి ఉపయోగించిన సూదితో గర్భిణి అయిన తన భార్యకు ఇంజెక్షన్​ చేశాడు. విడాకులు కావాలని విచక్షణా రహితంగా ప్రవర్తించాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో ఈ పాశవిక ఘటన వెలుగులోకి వచ్చింది. తన కుమార్తె అత్తామామలతో పాటు ఆసుప్రతి యజమాని ఈ కుట్రలో భాగస్వాములని తండ్రి ఆరోపించారు. వీరంతా బంధువులే అని పేర్కొన్నారు.

పోలీసులు, బాధితురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు మహేశ్‌ గౌతమ్ అలీగఢ్​లోని ఓ ఆసుపత్రిలోని ల్యాబ్​లో కాంట్రాక్టు టెక్నీషియన్​గా పనిచేస్తున్నాడు. గతేడాది డిసెంబర్​లో అతడికి ఓ యువతితో వివాహం జరిగింది. అయితే మహేశ్‌కు సహోద్యోగినితో అక్రమ సంబంధం ఉందని కొన్నాళ్ల క్రితం భార్యకు తెలిసింది. ఈ విషయంపై ఆమె నిలదీయడంతో అప్పటినుంచి విడాకులు కావాలని వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే.. ఓ వ్యక్తికి ఇచ్చిన హెచ్​ఐవీ సూదితో మహేశ్‌ తన భార్యకు ఇంజెక్షన్​ చేశాడు.

ఈ విషయాన్ని ఆమె తండ్రికి తెలియజేయడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. తను గర్భవతి అని తెలిసినప్పటి నుంచే భర్త తనకు హెచ్ఐవీ అంటించేందుకు ప్రయత్నిస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది. నిందితుడు మహేశ్‌ గౌతమ్, అతడి తల్లిదండ్రులు, ఆసుపత్రి యాజమాన్యంపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని