చచ్చిన పామును తిన్నందుకు వడివేలు అరెస్టు

చనిపోయిన పామును తిన్నాడనే కారణంతో తమిళనాడులోని మధురై జిల్లా పెరుమపట్టికి చెందిన వడివేలు(50) అనే వ్యవసాయ కూలీని అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు. చనిపోయిన పామును అతడు తింటున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అతడు ఆ

Updated : 30 May 2021 01:39 IST

మధురై: చనిపోయిన పామును తిన్నాడనే కారణంతో తమిళనాడులోని మధురై జిల్లా పెరుమపట్టికి చెందిన వడివేలు(50) అనే వ్యవసాయ కూలీని అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు. చనిపోయిన పామును అతడు తింటున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అతడు ఆ పామును తింటూ.. కొవిడ్‌ 19 నివారణకు పాములు విరుగుడుగా పని చేస్తాయని, వైరస్‌ నుంచి తనను తాను కాపాడుకోవడానికే ఆ పామును తింటున్నానని చెప్పడం ఆ వీడియోలో రికార్డయింది. ఆ వీడియోను చూసిన జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్‌ ఆనంద్‌ అధికారులను పంపి అతణ్ని అరెస్టు చేశారు. దీంతోపాటు అతడికి రూ.7 వేలు జరిమానా సైతం విధించారు. అయితే ఆ పామును తినాలని తనను కొందరు బలవంతం చేసినట్లు చెప్పాడని ఆనంద్‌ తెలిపారు. ఆ సమయంలో అతడు మద్యం సేవించి ఉన్నానని చెప్పిన్నట్లు పేర్కొన్నారు. అయితే పాములో విషం ఉన్న భాగాన్ని నోటితో తాకకపోవడంతో అతడికి ఎలాంటి హానీ జరగలేదని తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని