Hyderabad: భార్య చూస్తుండగానే భవనం పైనుంచి దూకేసిన భర్త

హైదరాబాద్‌ శివారు నార్సింగిలో విషాదం చోటుచేసుకుంది. భార్య చూస్తుండగానే భర్త భవనం పైనుంచి దూకేశాడు. 

Published : 07 Feb 2023 11:18 IST

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

నార్సింగి: హైదరాబాద్‌ శివారు నార్సింగిలో విషాదం చోటుచేసుకుంది. భార్య చూస్తుండగానే భర్త భవనం పైనుంచి దూకేశాడు. నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పీరంచెరువు ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం రేవన్‌ సిద్ధప్ప అనే వ్యక్తికి తన భార్యతో చిన్నపాటి గొడవ జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆవేదనకు గురైన రేవన్‌ సిద్ధప్ప.. ఒక్కసారిగా భవనం పైనుంచి కిందికి దూకాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రేవన్‌ మృతిచెందాడు. ఈ ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని