
Published : 05 Jan 2021 02:13 IST
పంజాగుట్ట పైవంతెన వద్ద వ్యక్తి హల్‌చల్
పంజాగుట్ట: పంజాగుట్ట పై వంతెన వద్ద మతిస్థిమితం లేని ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. పంజాగుట్ట చౌరస్తాలోని ట్రాఫిక్ పోలీస్ పైలాన్ ఎక్కి ఆత్మహత్యా యత్నం చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. జహీరాబాద్ మండలం న్యాలకల్‌కు చెందిన రవి ఆర్సీపురంలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా అతడి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో మూడు రోజుల క్రితం చందానగర్‌లోని ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. ఈ క్రమంలో ఆస్పత్రి బిల్లు భారం కావడంతో ఇవాళ నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించేందుకు తీసుకెళ్తుండగా వారి నుంచి తప్పించుకున్నాడు. పంజాగుట్ట చౌరస్తాలోని ట్రాఫిక్ పైలాన్ ఎక్కి చొక్కాతో ఉరి వేసుకునేందుకు యత్నించాడు. గమనించిన ట్రాఫిక్ పోలీసులు ఆర్టీసీ బస్సు సాయంతో అతడిని కిందకు దించి నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు.
Tags :