
షాకింగ్.. వీడియో కాల్ మాట్లాడుతూ నదిలోకి దూకేశాడు!
కోల్‌కతా: బెంగాల్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 29 ఏళ్ల యువకుడు వీడియో కాల్ మాట్లాడుతుండగానే వంతెన పైనుంచి నదిలోకి దూకేశాడు. జల్పాయిగుడి జిల్లాలోని రాణినగర్ బీఎస్‌ఎఫ్ క్యాంపు ప్రాంతం పరిధిలో ఆదివారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. తీస్తా నదిలో దూకేసిన ఆ యువకుడిని ధీరజ్ ప్రజాపతిగా గుర్తించారు. యువకుడి ఆచూకీ ఇంకా తెలియలేదన్నారు. గర్ల్‌ఫ్రెండ్‌తో వాగ్వాదం జరగడం వల్లే ఆకస్మికంగా నదిలోకి దూకేశాడని స్థానిక వ్యక్తి ఒకరు పేర్కొన్నారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
► Read latest Crime News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.