Crime News: వితంతువైన వదినతో పెళ్లి.. కాల్చిచంపిన ఇతర సోదరులు

వితంతురాలైన వదినను పెళ్లి చేసుకున్నాడనే కారణంతో ఓ వ్యక్తిని అతడి మిగతా సోదరులు కాల్చి చంపిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్‌పత్‌ గ్రామంలో వెలుగు చూసింది.

Updated : 16 Jun 2024 11:03 IST

బాగ్‌పత్‌: వితంతురాలైన వదినను పెళ్లి చేసుకున్నాడనే కారణంతో ఓ వ్యక్తిని అతడి మిగతా సోదరులు కాల్చి చంపిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్‌పత్‌ గ్రామంలో వెలుగు చూసింది. ఈశ్వర్‌ అనే వ్యక్తికి సుఖ్‌వీర్, ఓంవీర్, ఉదయ్‌వీర్, యశ్‌వీర్‌ అనే నలుగురు కుమారులున్నారు. గతేడాది సుఖ్‌వీర్‌ మృతిచెందడంతో అతడి భార్య రితూను యశ్‌వీర్‌ (32) పెళ్లి చేసుకున్నాడు. ఇది మిగతావాళ్లకు నచ్చకపోవడంతో కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుండేవి. దిల్లీలో బస్సు డ్రైవరుగా పనిచేస్తున్న యశ్‌వీర్‌ శుక్రవారం రాత్రి పని ముగించుకొని ఇంటికి వచ్చాడు. అప్పటికే మత్తులో ఉన్న అతడి సోదరులు తల్లితో వాగ్వాదానికి దిగారు. యశ్‌వీర్‌ రాకతో ఈ గొడవ మరింత తీవ్రమై అతణ్ని ఇతర సోదరులు తుపాకీతో కాల్చి చంపారు. నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నామని బాగ్‌పత్‌ ఏఎస్పీ ఎన్‌.పి.సింగ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని