Kadapa: ప్రాణం తీసిన పూచీకత్తు.. చంపేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు!
అప్పు పూచీకత్తు వ్యవహారం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. వైఎస్‌ఆర్ జిల్లా చింతకొమ్మదిన్నెలో చోటుచేసుకుంది. జూన్ 1న జరిగిన ఈ ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

చింతకొమ్మదిన్నె: అప్పు పూచీకత్తు వ్యవహారం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. వైఎస్‌ఆర్ జిల్లా చింతకొమ్మదిన్నెలో చోటుచేసుకుంది. జూన్ 1న జరిగిన ఈ ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్నేహితుడు తీసుకున్న రూ.15లక్షల అప్పునకు శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి పూచీకత్తుగా ఉన్నారు. అప్పు తీసుకున్న స్నేహితుడు రుణ దాతలకు తిరిగి ఇవ్వలేదు. దీంతో పూచీకత్తుగా ఉన్న శ్రీకాంత్‌ను అడిగారు. ఈ క్రమంలో ఆయనకు అప్పు ఇచ్చిన వ్యక్తులకు మధ్య వాగ్వాదం జరిగి అది ఘర్షణకు దారి తీసింది.
ఈ ఘర్షణలో శ్రీకాంత్‌రెడ్డి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించారు. ఆధారాలు లభించకూడదనే ఉద్దేశంతో మృతదేహంపై నిందితులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ హత్య కేసులో పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు, ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sai Pallavi: రాముడిగా రణ్‌బీర్.. సీతగా సాయిపల్లవి ఫిక్స్!
-
IMA: ఆస్పత్రి డీన్‌తో టాయిలెట్లు కడిగిస్తారా? ఐఎంఏ హెచ్చరిక!
-
Nobel Prize: రసాయన శాస్త్రంలో నోబెల్ వీరికే.. ప్రకటనకు ముందే ‘లీకుల’ కలకలం..!
-
Harmilan Bains: 13 ఏళ్ల వయసులోనే నిషేధం... ఆపై వరుస గాయాలు.. హర్మిలన్ పోరాటమిదీ!
-
Meta: మెటాలో మరోసారి ఉద్యోగుల తొలగింపు..!
-
Rajeshwari Kumari: అప్పుడు తండ్రి.. ఇప్పుడు తనయ... రజత పతకధారి రాజేశ్వరి కథ ఇదీ!