Crime News: ట్యాంక్‌లో నీళ్లు ఖాళీ చేసి.. కొడుకు కుటుంబానికి నిప్పంటించి..

ఆస్తి తగాదాలతో కన్న కొడుకు కుటుంబాన్ని అంతం చేశాడో తండ్రి.  కొడుకు ఇంటిపైకి పెట్రోల్‌ బాటిల్‌ విసిరి నిప్పంటించాడు. వారు ఎక్కడ బతుకుతారో అని ఇంట్లో ఉన్న ట్యాంక్‌లో

Updated : 19 Mar 2022 12:45 IST

తిరువనంతపురం: ఆస్తి తగాదాలతో కన్న కొడుకు కుటుంబాన్ని అంతం చేశాడో తండ్రి.  కొడుకు ఇంటిపైకి పెట్రోల్‌ బాటిల్‌ విసిరి నిప్పంటించాడు. వారు ఎక్కడ బతుకుతారో అని ఇంట్లో ఉన్న ట్యాంక్‌లో నీళ్లు కూడా ఖాళీ చేశాడు. ఈ అమానుష ఘటన కేరళలోని తొడుపుళలో నిన్న అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 

తొడుపుళలోని చీనికుళి ప్రాంతానికి చెందిన ఫైజల్‌ స్థానికంగా కిరాణా దుకాణాన్ని నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన తండ్రి హమీద్‌ కొన్నేళ్ల కిందట 50 సెంట్ల భూమిని ఫైజల్‌కు ఇచ్చాడు. అయితే ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో తన భూమి తనకు తిరిగిచ్చేయాలని హమీద్‌ అడిగాడు. ఇందుకు ఫైజల్‌ ఒప్పుకోకపోవడంతో వీరి మధ్య తగాదాలు మరింత పెరిగాయి.  ఈ క్రమంలోనే కొడుకుపై కోపం పెంచుకున్న హమీద్‌.. పక్కా పథకం ప్రకారం తన కొడుకు, కోడలు, ఇద్దరు మనవరాళ్లను అతి దారుణంగా హత్య చేశాడు. 

శుక్రవారం అర్ధరాత్రి ఫైజల్‌ తన భార్యాపిల్లలతో నిద్రిస్తుండగా.. హమీద్‌ గది బయటి నుంచి గడియపెట్టి రూంపైకి పెట్రోల్‌ బాటిల్‌ను విసిరాడు. ఆ తర్వాత నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయాడు. అంతకుముందే మంటలు ఆర్పడానికి వీలు లేకుండా ఇంట్లోని నీళ్ల ట్యాంకును ఖాళీ చేశాడు. మంటలు గమనించిన ఫైజల్‌ కుటుంబం గది నుంచి బయటకు రాలేక తమను తాము రక్షించుకునేందుకు బాత్రూమ్‌లోకి వెళ్లిపోయింది. అయితే అప్పటికే గది నిండా మంటలు వ్యాపించి నలుగురు సజీవదహనమయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు హమీద్‌ను అరెస్టు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని