Acid Attack: ప్రియుడితో వెళ్లిపోయిందని.. కోర్టులోనే భార్యపై యాసిడ్ దాడి!
ప్రియుడితో వెళ్లిపోయిందన్న ఆగ్రహంతో ఓ వ్యక్తి తన భార్యపై కోర్టు ప్రాంగణంలోనే యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. తమిళనాడులోకి కొయంబత్తూరులో ఈ ఘటన చోటుచేసుకుంది.
చెన్నై: ప్రియుడితో కలిసి వెళ్లిపోయిందన్న ఆగ్రహంతో ఓ వ్యక్తి తన భార్యపై యాసిడ్ దాడి(Acid Attack)కి పాల్పడ్డాడు. అదీ ఓ న్యాయస్థానం ప్రాంగణంలో కావడం గమనార్హం. తమిళనాడు(Tamil Nadu)లోని కొయంబత్తూరు(Coimbatore)లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బాధితురాలు 2016లో జరిగిన ఓ చోరీ కేసులో నిందితురాలు. ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు. ఈ కేసు విచారణ నిమిత్తం గురువారం జిల్లా న్యాయస్థానానికి వచ్చారు. కోర్టుకు వస్తుందని ముందే ఊహించిన ఆమె భర్త శివకుమార్.. పథకం ప్రకారం నీళ్ల సీసాలో యాసిడ్ తీసుకొచ్చాడు. ఆమె కనిపించగానే.. ఒక్కసారిగా ముఖంపై యాసిడ్ పోశాడు.
నొప్పితో విలవిల్లాడుతూ ఆమె అతడి బారినుంచి తప్పించుకునేందుకు యత్నించారు. ఈ దాడిలో ఆమె మెడ కింద తీవ్రగా కాలిపోయింది. అక్కడున్నవారు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే 80 శాతం గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. దాడి అనంతరం శివకుమార్ కోర్టు నుంచి తప్పించుకునేందుకు యత్నించగా.. పోలీసులు పట్టుకుని, అరెస్టు చేశారు. ‘లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న శివకుమార్, బాధితురాలు దంపతులు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ క్రమంలోనే వేరే వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. వారం క్రితం అతనితో వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహానికి గురైన భర్త దాడికి పాల్పడ్డాడు’ అని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
KTR: బెంగళూరుతో పోటీ పడేలా హైదరాబాద్‌ను నిలబెట్టాం: కేటీఆర్
-
General News
TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదాకు హైకోర్టు నిరాకరణ
-
India News
Mukhtar Ansari: గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీకి యావజ్జీవ కారాగార శిక్ష
-
India News
Wrestlers Protest: రైల్వే విధుల్లోకి టాప్ రెజ్లర్లు.. ఆందోళన కొనసాగుతుంది
-
Crime News
Jogulamba Gadwal: కృష్ణా నదిలో ఈతకు వెళ్లి నలుగురి మృతి
-
Sports News
WTC: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్.. ఆ జట్టులో రిషభ్ పంత్‌కు స్థానం!