Crime News: డబ్బులు, చాకెట్లు ఆశ చూపి బాలికపై అత్యాచారయత్నం

డబ్బులు, చాకెట్లు ఆశ చూపి బాలికపై ఓ ప్రబుద్ధుడు అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. వికారాబాద్‌ జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 06 Mar 2023 16:36 IST

వికారాబాద్‌: 12ఏళ్ల బాలికపై ఓ ప్రబుద్ధుడు అత్యాచార యత్నానికి ఒడిగట్టిన వికారాబాద్‌ జిల్లా కుల్కచర్ల మండలంలో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక గిరిజన తండాకు చెందిన మోతిలాల్ అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన బాలికకు డబ్బులు, చాకెట్లు ఇప్పిస్తానని తన వెంట తీసుకెళ్లాడు. తండ్రి వయసు ఉన్న వ్యక్తిని నమ్మిన బాలిక తన వెంట వెళ్లింది. ఇదే అదనుగా భావించిన మోతిలాల్‌ బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. తేరుకున్న బాలిక కేకలు వేయడంతో గమనించిన స్థానికులు అక్కడికి వచ్చేలోగానే ప్రబుద్ధుడు పారిపోయాడు. దీనిపై ఆదివారం రాత్రి బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని