
వైద్య ఖర్చుల కోసం.. బ్యాంక్ దోపిడీ యత్నం!
ముంబయి: ఓ వ్యక్తికి వైద్య ఖర్చులు, అప్పులు తీర్చడం కోసం డబ్బులు అవసరమయ్యాయి. అంత డబ్బు ఎలా తేవాలో అర్థం కాగా.. ఏకంగా బ్యాంక్‌లో దోపిడీ చేయాలనుకున్నాడు. ఇందుకోసం మహారాష్ట్రలో వార్ధ నగరంలోని సేవాగ్రామ్ ప్రాంతంలో ఉన్న ఓ బ్యాంకును ఎంచుకున్నాడు. గత శుక్రవారం మధ్యాహ్నం ముఖానికి మాస్క్‌ను ధరించి, నేరుగా బ్యాంక్‌లోకి వెళ్లాడు. క్యాష్ కౌంటర్ వద్దకి వెళ్లి 15 నిమిషాల్లో రూ. 55లక్షలు ఇవ్వాలని.. లేదంటే తన వద్ద ఉన్న బాంబును పేల్చేస్తానని బెదిరిస్తూ ఓ లేఖ అందించాడు. అది చూసి బ్యాంక్ సిబ్బంది కంగుతిన్నారు. ఆత్మాహుతి దాడి చేసుకుంటానని హెచ్చరించడంతో బ్యాంక్‌లో భయానక వాతావరణం నెలకొంది.
అయితే, బ్యాంక్ సిబ్బంది అప్రమత్తమై ఎదురుగానే ఉన్న పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెంటనే బ్యాంక్‌కు చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న బాంబు నకిలీదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒక డిజిటల్ గడియారం, ఆరు పైపులకు వైర్లు అతికించి పెట్టాడనని గుర్తించారు. అలాగే అతని నుంచి కత్తి, ఎయిర్ పిస్టోల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు యోగేశ్ కుబాడేగా పోలీసులు గుర్తించారు. సైబర్ కేఫ్‌ను నిర్వహించే అతడు.. తన అప్పులు, వైద్య ఖర్చుల కోసం బ్యాంక్ దోపిడీకి యత్నించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.