IndiGo: విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్‌ తెరిచి ఆత్మహత్యాయత్నం..

కుంగుబాటుతో ఆత్మహత్య చేసుకోవాలని ఓ విమాన ప్రయాణికుడు (Flight) ఎమర్జెన్సీ డోర్‌ను తెరిచాడు. తోటి ప్రయాణికులను భయందోళనకు గురి చేశాడు. 

Published : 22 Sep 2023 16:51 IST

గువహటి: విమానం గాల్లో ఉండగా.. ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్‌ తెరిచాడు. తోటి ప్రయాణికులను భయందోళనకు గురి చేశాడు. ఈ ఘటన ఇండిగో విమానంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండిగో విమానం గురువారం మధ్యాహ్నం గువహటి (Guwahati) నుంచి అగర్తల (Agartala)కు బయలుదేరింది. విమానం టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే అందులో ప్రయాణిస్తున్న బిస్వజిత్ దేబత్ (41) ఎమర్జెన్సీ డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించాడు.

దీంతో ఒక్కసారిగా తోటి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. విమానం అగర్తల ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ కాగానే ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి.. కేసు నమోదు చేశారు. పశ్చిమ త్రిపురలోని జిరానియాకు చెందిన దేబత్ కుంగుబాటు కారణంగా ఎమర్జెన్సీ డోర్‌ తెరిచేందుకు యత్నించినట్లు విచారణలో తేలింది. ఆత్మహత్యాయత్నాన్ని ప్రయాణికులు అడ్డుకోగా.. వారితో అతడు గొడవ దిగినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం నిందితుడిని స్థానిక కోర్టులో హాజరుపరిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని