దంతెవాడ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు హతం

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు హతమైనట్లు పోలీసులు తెలిపారు.

Published : 21 Apr 2021 01:41 IST

దంతెవాడ: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు హతమైనట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన మావోయిస్టును మలంగీర్‌ ఏరియా కమిటీ సభ్యుడు కోసగా గుర్తించారు. అతనికి 15 కేసులతో ప్రమేయం ఉండటంతో పాటు తలపై రూ.5 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. నీలవాయి అడవుల్లో జిల్లా రిజర్వు గార్డ్స్‌, నక్సల్స్‌ వ్యతిరేక దళం సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో మావోయిస్టు హతమైనట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ చెప్పారు. 

ఘటనా స్థలం నుంచి 9 ఎమ్‌ఎమ్‌ పిస్టల్‌, దేశవాలీ బార్మర్‌, మూడు కిలోల పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బీజాపూర్‌ ఎదురు కాల్పుల్లో 22 మంది జవాన్లు అమరులైన తర్వాత జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని