టన్నెల్ ఎఫైర్: ప్రియురాలి ఇంటికే సొరంగం
మెక్సికో సిటీ: ప్రియురాలిని చాటుగా కలిసేందుకు రకరకాల ప్రయత్నాలు చేసే వాళ్ల గురించి వింటుంటాం. కానీ ఇది అంతకు మించి! పెళ్లైన ఓ వ్యక్తి తన ప్రియురాలిని తరచూ కలిసేందుకు తన ఇంటినుంచి ఆమె ఇంటి వరకు భారీ సొరంగాన్ని తవ్వి అడ్డంగా దొరికిపోయాడు. మెక్సికోలోని తిజునా పట్టణంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఆల్బెర్టో అనే వ్యక్తి నిర్మాణ రంగంలో పనిచేస్తున్నాడు. విల్లాస్ డెల్ ప్రాడో -1లో పొరుగున ఉండే తన ప్రియురాలు పమిలాతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. రహస్యంగా కలిసేందుకు ఆమె ఇంటికి ఏకంగా పెద్ద సొరంగాన్నే తవ్వాడు. ఆమె భర్త జార్జ్ విధుల్లోకి వెళ్లిన సందర్భంలో ఈ సొరంగం తవ్వినట్టు భావిస్తున్నారు. అయితే, అతడు విధులకు వెళ్లగానే సొరంగం ద్వారా ఇంట్లోకి ప్రవేశించి రహస్యంగా కలుస్తుండేవాడు.
ఈ క్రమంలోనే ఓ రోజు జార్జ్ విధులు త్వరగా ముగించుకొని ఇంటికి వచ్చాడు. ఏదో అనుమానం వచ్చి బెడ్‌రూమ్‌లో మంచం కింద చూడగా అక్కడ ఎవరూ కనబడలేదు. ఆ తర్వాత సోఫా కదలడాన్ని చూసి షాక్ అయిన జార్జ్.. దాని వెనుక ఉన్న ఆల్బెర్టోను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో వీరిద్దరి బండారం బయటపడింది. అలాగే, తన ఇంటి ఫ్లోర్‌పై ఉన్న రంధ్రాన్ని చూసి.. దాన్ని పరిశీలించగా అదో పెద్ద సొరంగమని, ఆల్బెర్ట్ ఇంటిదాకా ఉన్నట్టు తెలిసి కంగుతిన్నాడు. ఇదిలా ఉండగా.. సొరంగ మార్గాన్ని అనుసరిస్తూ తన ఇంటికి వచ్చిన జార్జ్‌ను ఈ ఎఫైర్ గురించి తన భార్యకు చెప్పొద్దని, అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ అల్బెర్టో వాదనకు దిగాడు. దీంతో వారిద్దరి మధ్య ఘర్షణ తలెత్తడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఈ సీక్రెట్ టన్నెల్‌కు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఇవీ చదవండి..
తెలంగాణలో నేరాలు..ఘోరాలు@ 2020
చుక్కేసి నడిపారు.... ప్రాణాలు తీశారు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Uddhav Thackeray: ‘త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడం వల్ల దేశ భక్తులు కాలేరు’
-
Sports News
MS Dhoni : దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో మెంటార్‌గా ధోనీ సేవలు ఈసారికి కష్టమే!
-
General News
cardiac: ఛాతీలో నొప్పిగా ఉందా..? ఎందుకో తెలుసుకోండి..!
-
Viral-videos News
Viral Video: క్షణం ఆలస్యమైనా పాము కాటేసేదే..! అంతలో ఏం జరిగిందంటే
-
World News
Yuan Wang 5: అభ్యంతరం తెలుపుతున్నప్పటికీ.. చైనా నౌకకు శ్రీలంక మరోమారు అనుమతి
-
Sports News
Nitish Rana : నిరుడు సరిగా ఆడలేదు.. ఈసారి రాణిస్తే.. విస్మరించరుగా..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Karthikeya 2 Review: రివ్యూ: కార్తికేయ-2
- Naga Chaitanya: సినిమా మధ్యలోనే ప్రేక్షకులు బయటకు వచ్చేశారు.. బాధేసింది: నాగచైతన్య
- F3: ‘ఎఫ్-3’.. వెంకీ ఎలా ఒప్పుకొన్నాడో ఏంటో: పరుచూరి గోపాలకృష్ణ
- Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు: రిషి సునాక్
- Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
- kareena kapoor: వాళ్లే మా సినిమాను ట్రోల్ చేశారు..అందుకే ఇలా! కరీనా కపూర్
- Salman Rushdie: కన్ను కోల్పోవచ్చు.. చేతుల్లో నరాలు తెగిపోయాయి..!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (13/08/2022)
- SCR: చుట్టూ చూడొచ్చు.. చుక్కలూ లెక్కెట్టొచ్చు.. ద.మ.రైల్వేలో తొలి రైలు
- IND vs PAK: భారత్ vs పాక్ మ్యాచ్‌పై రికీ పాంటింగ్ జోస్యం