Andhra News: అచ్యుతాపురం సెజ్‌లో పేలిన రియాక్టర్: ఒకరి మృతి.. ముగ్గురికి తీవ్రగాయాలు

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్‌)లో భారీ పేలుడు జరిగింది. లాలంకోడూరు సమీపంలోని ఓ ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలింది.

Updated : 31 Jan 2023 12:53 IST

అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్‌)లో భారీ పేలుడు జరిగింది. లాలంకోడూరు సమీపంలోని జీఎఫ్‌ఎంఎస్‌ ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో..  భయాందోళనకు గురైన కార్మికులు అక్కడ నుంచి పరుగులు తీశారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కర్మాగారంలో ఉన్న కార్మికులను బయటకు పంపించారు. ప్రమాదానికి గల కారణాలు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అగ్నిమాపక అధికారులు విచారణ ప్రారంభించారు. కంపెనీ ప్రతినిధుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని